BigTV English

Tri-Series : ఈ 3 ట్రై సిరీస్ లు ఆడితే.. వరల్డ్ కప్ రేంజ్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే

Tri-Series : ఈ 3 ట్రై సిరీస్ లు ఆడితే.. వరల్డ్ కప్ రేంజ్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే

Tri-Series : సాధారణంగా క్రికెట్ లో ఈ మధ్య కాలంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎప్పుడూ ఏ మ్యాచ్ జరుగుతుందో.. ఎప్పుడూ ఏ మ్యాచ్ జరగదో కూడా ఊహించడం కష్టంగా మారింది. వాస్తవానికి ఈనెల 24న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆసియా కప్ కి సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శ్రీలకం, టీమిండియా బాయ్ కాట్ చేశాయి.  దీంతో ఆసియా కప్ జరుగుతుందో లేదోననే అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే  ప్రస్తుతం  WCL మ్యాచ్ లు కూడా జరుగుతున్న వేళ.. ఇవాళ జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా రద్దు అయింది. ఇలాంటి అకస్మాత్ నిర్ణయాలు వినడానికే చాలా విచిత్రంగా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. అది ఏంటంటే..? టీమిండియా-ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్లు కలిసి ట్రై సిరీస్ మ్యాచ్ లు ఆడనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read :  Urvil Patel : RCB కోట్లల్లో ఆఫర్.. కానీ ధోని కోసం ఛీ.. కొట్టిన యంగ్ ప్లేయర్.. ఇదిరా CSK బ్రాండ్ అంటే

ఇండియా-ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ సిరీస్.. 


వీటి గురించి ఓ సారి పరిశీలించినట్టయితే.. ముఖ్యంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్- ఇండియా జట్లు టెస్ట్ సిరీస్, అలాగే వన్డే సిరీస్, అదేవిధంగా టీ-20 సిరీస్ మ్యాచ్ లను ఆడనున్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ఈ ట్రై సిరీస్ లు జరిగితే.. వరల్డ్ కప్ రేంజ్ లో క్రికెట్ అభిమానులకు పండుగే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇటు ఇండియా, అటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు లాభాలు రావడంతో పాటు అభిమానులకు కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ కూడా రానుంది. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే 3 టెస్టు మ్యాచ్ లు ఆడింది. ఇంకా రెండు 2 టెస్ట్ మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు 2-1 తేడాతో ఇంగ్లాండ్ జట్టు ముందంజలో దూసుకువెళ్తోంది. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో 2 గెలిస్తే.. ఇంగ్లాండ్ విజయం సాధిస్తుంది.

ట్రై సిరీస్ జరిగితే ఆసక్తికరం

ఇక ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడితే ఆస్ట్రేలియా జట్టు మూడు విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తోంది. ఈ మూడు జట్లు టీ-20, వన్డే, టెస్ట్ సిరీస్ లు ఆడితే చాలా ఆసక్తిగా ఉంటుందని అందరూ చర్చించుకోవడం విశేషం. ఒకవేళ అలా ట్రై సిరీస్ జరిగితే టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కొనసాగుతారు. వన్డే మ్యాచ్ ల విషయానికొస్తే.. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ కొనసాగుతారు. ఇక టీ-20ల విషయానికొస్తే.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆస్ట్రేలియా కెప్టెన్ గా మిచెల్ మార్ష్, ఇంగ్లాండ్ కెప్టెన్ గా హ్యారీ బ్రూక్  కొనసాగుతాడు.

Related News

Suryakumar Yadav : పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపిన సూర్య కుమార్… నమ్మకద్రోహం అంటూ ట్రోలింగ్!

Lalit Modi : ఇండియాను నిండా ముంచిన లలిత్ మోడీ అదిరిపోయే ప్లాన్.. ఫుట్ బాల్ వద్దు.. కబడ్డీ ముద్దు అంటూ

Mornie Morkel : పాకిస్తాన్ వీక్నెస్ మాకు తెలుసు.. వాళ్లను చావు దెబ్బ కొడతాం… టీమిండియా కోచ్ వార్నింగ్

Sachin-Sara : సచిన్ కు షాక్… సంపాదనలో తండ్రిని దాటిన సారా టెండూల్కర్.. ఒక్క పోస్టుకు ఎంత రేటు అంటే

Harbhajan Singh : భ‌జ్జీ రియ‌ల్ హీరో…వ‌ర‌ద బాధితుల కోసం భారీ సాయం..3 అంబులెన్సులు కూడా

Rishab Pant : చిన్నపిల్లడిలా కటింగ్ చేయించుకున్న పంత్… టీమిండియాలోకి రీ ఎంట్రీ అప్పుడే..

×