Rashmika Mandanna: నేషనల్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవ్వడమే కాకుండా వరుస విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది. తాజాగా కుబేర సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు ఈ మైసా(Mysaa) అనే సినిమాని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ బిగ్ సర్ప్రైజ్ ఏంటో?
ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇటీవల కాలంలో తనకు సంబంధించి ఓ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి తాను ఎదురు చూడలేకపోతున్నానని ఎప్పుడెప్పుడు ఆ విషయాన్ని అభిమానులతో పంచుకోవాలా అని ఎదురుచూస్తున్నానంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు. అయితే తాజాగా ఈమె మరొక వీడియోని కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా రేపు అభిమానుల కోసం చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటూ తెలియచేశారు.
నా హృదయానికి దగ్గరగా..
ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. అయితే ఈ విషయం తన కొత్త సినిమాకు సంబంధించి కాదని క్లారిటీ ఇచ్చారు. నేను నాకెంతో ఇష్టమైన నా హృదయానికి దగ్గరగా ఉన్న ఒక ప్రాజెక్టుపై పని చేస్తున్నానని అయితే అది సినిమా మాత్రం కాదని, గత కొన్ని సంవత్సరాలుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు నా నుంచి ఈ చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను అయితే ఈ విషయం కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా చాలా ఎదురుచూస్తున్నానని తెలియజేశారు.
?igsh=MjlsOWpjdHVleTZs
ఇలా రష్మిక షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో అభిమానులు కూడా రష్మిక రేపు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్మిక ఇటీవల ఒక బిజినెస్ ప్రారంభించబోతున్నానని తన తల్లితో మాట్లాడినటువంటి ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. బహుశా తన కొత్త బిజినెస్(New Business) గురించి రేపు ప్రకటన ఇవ్వబోతున్నారా? లేదంటే తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఏదైనా షేర్ చేసుకోబోతున్నారా? అంటూ అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మరి రష్మిక ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారో తెలియాలి అంటే రేపటి వరకు మనం కూడా ఎదురు చూడాల్సిందేనని తెలుస్తోంది.
Also Read: Nikhil Siddarth: ప్లీజ్.. వాటికైనా పర్మిషన్ ఇవ్వండి.. రిక్వెస్ట్ చేసుకున్న యంగ్ హీరో?