Urvil Patel : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతని టీమిండియా కి 2007లో తొలిసారిగా టీ-20 వరల్డ్ కప్, 2011లో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. దీంతో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతను ఏది పట్టుకున్న బంగారం.. అతనికీ అన్ని రంగాల్లో కలిసి వచ్చేది. ధోనీ ప్రస్తుతం టీ-20, వన్డే, టెస్టు మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి ఆడుతున్నాడు. ఐపీఎల్ కొత్త కొత్త క్రికెటర్లను తయారు చేసి టీమిండియాకి అందిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్, బ్యాటర్ ఉర్విల్పటేల్ ధోనీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Cricketers Names : ఇవెక్కడి పేర్లు రా నాయనా… క్రికెటర్లపై దారుణంగా ట్రోలింగ్
ధోనీ కోసం.. నాన్న వచ్చాడు
ముఖ్యంగా ఐపీఎల్ లో మెగా వేలంలో అమ్ముడు పోకుండా ఉండటం నుంచి రీ ప్లేస్ మెంట్ క్రికెటర్ గా ఎంపిక కావడం వరకు తాను ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నాడో వెల్లడించారు ఉర్విల్ పటేల్. ఉర్విత్ పటేల్ కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ధోనీ కోసం ఈ యంగ్ ప్లేయర్ ఆర్సీబీ కి వెళ్లకుండా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడేందుకు సీఎస్కేలోకి వచ్చాడు. ఐపీఎల్ 2025 మధ్యలో వంశ్ బేడీ స్థానంలో ఉర్విల్ చెన్నై కి వచ్చాడు. తక్కువ వ్యవధిలో తన ప్రభావం ఏంటో చూపించాడు. తాను ఆడటం చూసి తన తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారని తెలిపారు. ధోనీని కలవాలని తాను మా నాన్న కు చెప్పాను. మా నాన్న అతని కారణంగా మ్యాచ్ చూసేందుకు వచ్చాడని ఉర్విల్ తెలిపాడు.
ఉర్విల్ రికార్డు సెంచరీ
ముఖ్యంగా ఉర్విల్ పటేల్ దేశవాళీ టీ-20 టోర్నీలో ఇటీవలే అద్భుతమైన సెంచరీ చేశాడు. తక్కువ బంతుల్లో సెంచరీ చేసి సరికొత్త రికార్డును లిఖించిన బ్యాట్స్ మెన్ ఉర్విన్ పటేల్. ఇటీవల ఇండోర్ లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో త్రిపుర, గుజరాత్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించింది గుజరాత్. ఉర్విన్ పటేల్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడాడు. 10.2 ఓవర్ వరకు చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. చివరికీ 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విన్ పటేల్ 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 113 పరుగులు చేసాడు. ఈ సెంచరీతో టీ-20 క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా ఉర్విన్ పటేల్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2018 హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం 32 బంతుల్లోే సెంచరీ చేశాడు. దీంతో క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్ మెన్ గా నిలిచాడు.