BigTV English

who is Shashank Singh: శశాంక్ ని ముందు పంజాబ్ వద్దని అనుకుందా..?

who is Shashank Singh: శశాంక్ ని ముందు పంజాబ్ వద్దని అనుకుందా..?
who is shashank singh
who is shashank singh

Shashank Singh of ‘Mistaken Identity’ Fame at IPL 2024 Auction:  గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న శశాంక్ సింగ్ అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిపోయాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఇంతకీ ఇప్పుడీ శశాంక్ సింగ్ ఎవరనే చర్చ నెట్టింట తీవ్రంగా జరుగుతోంది.


ఇది చెప్పేముందు పంజాబ్ కింగ్స్ లోకి తను అనుకోకుండా తను వచ్చాడు. వేలం అయిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ నాలిక్కరుచుకుంది. అయ్యో మేం అనుకున్న శశాంక్ ఇతను కాదు, మరొకరు అని తెలిపింది. కానీ అప్పటికే వేలం ముగిసిపోవడంతో చేసేది లేక ప్రారంభ ధర రూ.20 లక్షలకి కొనుగోలు చేసింది.

అలాంటివాడే ఈరోజున గుజరాత్ టైటాన్స్ పై చెలరేగి ఆడాడు.  29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి  ఓడిపోయే మ్యాచ్ ని మళ్లీ పట్టాలెక్కించాడు. తర్వాత మిగిలినవారు లాంఛనం పూర్తి చేసి, పంజాబ్ కి విజయన్ని అందించారు.


డీవై పాటిల్ టోర్నమెంట్ సమయంలోనే పంజాబ్ కెప్టెన్ ధావన్ కి తను పరిచయం అయ్యాడు. ఎందుకంటే ఆ టోర్నమెంటులో ఆ జట్టుకి  శశాంక్ కెప్టెన్ గా ఉన్నాడు. ధావన్, దినేశ్ కార్తీక్, బదోనీలాంటి ఆటగాళ్లు ఇదే జట్టులో గఆడారు.దీంతో ధావన్ కి అప్పుడే శశాంక్ ఆటలోని ప్రతిభ తెలిసింది. అది గుర్తించి మొదటి నుంచి ఐపీఎల్ లో పట్టుపట్టి మరీ అవకాశాలిస్తూ వచ్చాడు. ఈరోజున ధావన్ నమ్మకాన్ని నిరూపించాడు. ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ శశాంక్ సిక్సులు కొట్టిన తీరు అద్భుతంగా ఉంది. ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో  ఆడుతున్నాడని ప్రశంసించాడు.

Also Read: రోహిత్ శర్మ.. ముంబైని వదిలేస్తున్నాడా?

డీవై పాటిల్ గ్రూప్ లో ఉద్యోగం చేస్తున్న శశాంక్ దేశవాళి క్రికెట్ లో కూడా తన ప్రతిభను చాటుతున్నాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్, రాజస్తాన్, ఢిల్లీకి కూడా ఆడాడు. అయితే పంజాబ్ లో తన ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. నిజానికి బీసీసీఐలో జనరల్ మేనేజర్ అభయ్ కురువిల్లా తన ప్రతిభను గుర్తించి సాయం చేశాడు. తన గురువు అయిన కురువిల్లా పేరును నిలబెట్టానని ఆల్ రౌండర్ శశాంక్ చెబుతుంటాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×