BigTV English

WI Vs AFG Highlights : పూరన్ ఊచకోత.. ఆఫ్గాన్ పై వెస్టిండీస్ ఘన విజయం!

WI Vs AFG Highlights : పూరన్ ఊచకోత.. ఆఫ్గాన్ పై వెస్టిండీస్ ఘన విజయం!

T20 World Cup 2024 – West Indies Beats Afghanistan by 104 Runs: టీ 20 ప్రపంచకప్ లో మరో సంచలన విజయం నమోదైంది. లీగ్ లో ఆఖరి మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగింది. ఇక్కడ చిత్రం ఏమిటంటే రెండు జట్లు సూపర్ 8కి క్వాలిఫై అయ్యాయి. అక్కడికి వెళ్లే ముందు ప్రాక్టీస్ లా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ రెచ్చిపోయి ఆడింది.


నికోలస్ పూరన్ ఇరగదీసి ఆడటంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 218 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఫ్గనిస్తాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో 104 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బౌలింగు ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన వెస్టిండీస్ కి రెండో ఓవర్ లో దెబ్బ తగిలింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) అయిపోయాడు. మరో ఓపెనర్  జాన్సన్ చెలరేగి ఆడాడు. 27 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేశాడు.


Also Read: పాకిస్తాన్ లో ఆగ్రహం : శ్రీలంక, కివీస్ లో ఎందుకు లేదు ?

ఫస్ట్ డౌన్ వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతేకాదు నయా రికార్డు నెలకొల్పాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 36 పరుగులు రాబట్టుకున్నాడు. ఇందులో 3 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. లెగ్ బైస్ 4 పరుగులు వచ్చాయి. ఒమర్జాయ్ నోబాల్, వైడ్ బాల్ వేయడంతో అన్నీ కలిపి ఇన్ని పరుగులు వచ్చాయి.

మొత్తానికి 53 బంతుల్లో 8 సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో 98 పరుగులు చేసి, సరిగ్గా సెంచరీకి 2 పరుగుల ముందు రనౌట్ గా వెనుతిరిగాడు. దీంతో అభిమానులందరూ హతాశుయులయ్యారు. పూరన్ కూడా నిరాశగా వెనుతిరిగాడు.

తర్వాత వచ్చిన షాయి హోప్ 17 బంతుల్లో 25, కెప్టెన్ రోవ్ మన్ పోవెల్ 15 బంతుల్లో 26 పరుగులు చేసి స్కోరు బోర్డుని పరుగులెత్తించి అవుట్ అయ్యారు. చివరికి రసెల్ (3), రూథర్ ఫోర్డ్ (1) నాటౌట్ గా నిలిచారు. మొత్తానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.

Also Read: Rohit Sharma: భారతీయులకి.. రోహిత్ శర్మ కౌన్సెలింగ్ !

ఆఫ్గాన్ బౌలింగులో ఒమర్ జాయ్ 1, నవీన్ఉల్ హక్ 1, గులాబిద్దిన్ నాయిబ్ 2 వికెట్లు పడగొట్టారు. విచిత్రం ఏమిటంటే కెప్టెన్ రషీద్ ఖాన్ అందరికన్నా ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్టు రాలేదు.

219 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గాన్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తిగిలింది. స్టార్ ఓపెనర్ గుర్బాజ్ డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జర్దాన్ మాత్రం కాసేపు పోరాడాడు. 28 బంతుల్లో 1 సిక్స్ , 5 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నజీబుల్లా జర్దాన్  డక్ అవుట్ అయ్యాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×