E-Paper
Advertisement

WI Beat Pak in ODI Series : పాకిస్తాన్ క్రికెట్ లో భూకంపం..5 గురు డకౌట్.. 34 ఏళ్ల తర్వాత ఓటమి

WI Beat Pak in ODI Series : పాకిస్తాన్ క్రికెట్ లో భూకంపం..5 గురు డకౌట్.. 34 ఏళ్ల తర్వాత ఓటమి
Advertisement

WI Beat Pak in ODI Series : పాకిస్తాన్ తో స్వదేశంలో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ సూపర్ విక్టరీ సాధించింది. తొలుత కెప్టెన్ హోప్ 120తో విజృంభించడంతో వెస్టిండీస్ జట్టు 294 పరుగులు చేసింది. ఇక ఆ తరువాత పాకిస్తాన్ ను 92 రన్స్ కే ఆలౌట్ చేసి 202 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. దాదాపు 34 ఏళ్ల తరువాత పాకిస్తాన్ పై  విండిస్ ద్వైపాక్షిక సిరీస్ గెలవడం విశేషం. అంతకు ముందు టీ-20 సిరీస్ ను మాత్రం పాకిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. వాస్తవానికి టీ-20 అంటే వెస్టిండీస్ ఆటగాళ్లు కాస్త దూకుడుగా ఆడుతారు. కానీ ఈ సిరీస్ లో తమ దూకుడు ని మాత్రం చూపించలేదు. 

Also Read : Viral Video: 3 కొండల నడుమ క్రికెట్… కొంచెం అటు ఇటు అయినా ప్రాణం పోవాల్సిందే

Advertisement

వెస్టిండీస్ చేతిలో పాక్ చిత్తు చిత్తు.. 

తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు బ్రాండన్ కింగ్ 05, లూయిస్ 37, కార్టీ 17, హోప్ 120, రూథర్ ఫర్డ్ 15, రోస్టన్ చేజ్ 36, మోతె 05, జస్టిన్ గ్రెవిస్ 43 పరుగులు చేయడంతో మొత్తం 50 ఓవర్లలో 294 పరుగులు చేసింది వెస్టిండిస్ జట్టు. 6 వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ 2, అయూబ్ 1, మహ్మద్ నవాజ్ 1 వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్ కి దిగిన పాకిస్తాన్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. 9.2 ఓవర్లలోనే పాకిస్తాన్ జట్టు 10 వికెట్లను కోల్పోయింది. అందులో 5గురు డకౌట్ అయ్యారు. ఓపెనర్లు  అయూబ్, అబ్దుల్లా షఫిక్ ఇద్దరూ కూడా డకౌట్ కావడం గమనార్హం. బాబర్ ఆజమ్ 09, మహ్మద్ రిజ్వాన్ 0, సల్మాన్ అఘా 30, హాసన్ నవాజ్ 13, హుస్సెన్ 1, మొహమ్మద్ నవాజ్ 23, నసీమ్ షా 6, హాసన్ అలీ 0, అబ్రార్ అహ్మద్ 0 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 92 పరుగులకే కుప్ప కూలింది. దీంతో వెస్టిండీస్ 202 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

Advertisement

పాక్ కి చుక్కలు చూపించిన వెస్టిండీస్ బౌలర్లు 

ముఖ్యంగా 295 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు కి విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. జేడన్ సీల్స్ ధాటికి ఓపెనర్లు సయూమ్ అయుబ్, షపీక్ డకౌట్ అయ్యారు. మరోవైపు బ్యాటింగ్ కి వచ్చిన రిజ్వాన్ కూడా తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కెప్టెన్ రిజ్వాన్ ఆశ్చర్యపోయాడు. జేడన్ సీల్స్ సంధించిన ఇన్ స్వింగర్ ను తప్పుగా అంచనా వేసిన రిజ్వాన్.. బంతిని వదిలేశాడు. దీంతో అది అనూహ్య రీతిలో స్టంప్ పై బాగానికి తాకగా ఊహించని పరిణామంతో రిజ్వాన్ బిక్కముఖం వేశాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో విండీస్ బౌలర్లలో ఆరు వికెట్లతో చెలరేగిన జెడన్ సీల్స్ ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. గుడకేశ్ మోడీ రెండు, రోస్టన్ ఛేజ్ 1 వికెట్ దక్కించుకున్నారు.

 

Tags

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×