Sandeep Reddy Vanga: చాలామంది తెలుగు దర్శకులు హిందీకి వెళ్లి అక్కడ టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే హిందీలో సక్సెస్ అయ్యారు. అందులో రామ్ గోపాల్ వర్మ మొదటి వరుసలో ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటే సందీప్ రెడ్డి వంగ అక్కడికి వెళ్లి యానిమల్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత అదే సినిమాను సాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాని చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ట్రోల్ చేశారు. చాలా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా మాత్రం దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
అక్కడ సినిమా తీయడం ఈజీ
అర్జున్ రెడ్డి సినిమా విడుదలకు ముందే పలు వివాదాలను ఎదుర్కొన్నాడు సందీప్ రెడ్డి వంగ. స్వతహాగా వాళ్లే ప్రొడ్యూసర్స్ కావడంతో కొద్దిపాటి నష్టాన్ని కూడా భరించాడు. చాలా ఇంటర్వ్యూస్ లో కూర్చొని ఓపిగ్గా సమాధానం చెప్పాడు. ఇవన్నీ సినిమాకు ముందు జరిగినవి. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ సినిమాను ప్రేక్షకులే ముందుకు తీసుకెళ్లారు. అప్పట్లో శివ సినిమా ఇప్పట్లో అర్జున్ రెడ్డి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ ఇండియాలో సినిమా తీయడం కంటే హాలీవుడ్లో సినిమా తీయడం చాలా ఈజీ అంటూ మాట్లాడాడు. అంటే ఒక సినిమా తీయడానికి సందీప్ రెడ్డి ఎన్ని ఆంక్షలు దాటుతున్నాడు ఆ మాటలను బట్టి అర్థమవుతుంది.
భారీ హైప్ సలార్
ఇప్పటివరకు సందీప్ రెడ్డివంగా రెండు సినిమాలు తీశాడు. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. వాస్తవానికి మూడు తీసిన కబీర్ సింగ్ రీమేక్ కాబట్టి అది పెద్దగా లెక్కలోకి రాదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసు పాత్రలో కనిపిస్తున్నారు. మామూలుగా ఒక ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ రాయడం అనేది సందీప్ రెడ్డి వంగాకి అలవాటు. అలాంటిది ఒక పోలీస్ క్యారెక్టర్ రాస్తున్నాడు అంటే అది ఏ లెవెల్ లో ఉండబోతుందో అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. వాస్తవానికి ప్రభాస్ లైన్ అప్స్ లో ఉన్న సినిమాల్లో దీనిమీద ఎక్కువ హైప్ ఉంది అని చెప్పిన అతిశయోక్తి లేదు.
Also Read: Lokesh Kanagaraj: ఆ ఒక్క ట్వీట్ కానీ వేస్తే, 1000 కోట్లు నడుచుకుంటూ వస్తాయి