Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉంది అని రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. వాస్తవానికి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. సినిమాల మీద ఏకాగ్రత తగ్గించి కంప్లీట్ గా తన దృష్టిని రాజకీయాలకే పరిమితం చేశారు పవన్ కళ్యాణ్. సినిమాలను ఒప్పుకున్నారు కాబట్టి అవి పూర్తి చేయాలి కాబట్టి వాటిని పూర్తి చేశారు.
పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా మంచి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. జానీ (Johnny) సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కు సరైన హిట్ సినిమా లేనప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) జల్సా సినిమాతో మంచి హిట్ అందించాడు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాలలో చెప్పారు. అందరూ రీమేక్ సినిమాతో నా దగ్గరికి వస్తే త్రివిక్రమ్ మాత్రం స్ట్రైట్ ఫిల్మ్ తో వచ్చాడు అంటూ మాట్లాడారు.
మళ్లీ అదే సినిమా
వాస్తవానికి పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా బాగుంటుంది. సంజయ్ సాహు అనే పాత్రలో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అలానే త్రివిక్రమ్ రైటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది. మళ్లీ అదే సినిమాను రి రిలీజ్ చేస్తున్నారు. అయితే మొదటిసారి రీ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాను విపరీతంగా చూసి బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మళ్లీ అదే సినిమా రావడం కొద్దిపాటి నిరాశను మిగులుస్తుందని చెప్పాలి. మరో రకంగా ఆలోచిస్తే పవన్ కెరియర్లో మళ్లీ రీ రిలీజ్ రూపంలో అందించటానికి పెద్దగా సినిమాలు ఏమీ లేవు.
ఆ కష్టం మరొకరికి రాకూడదు
ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే నటించిన తొలిప్రేమ (tholi Prema), బద్రి (Badri), తమ్ముడు (Thammudu), ఖుషి (Khushi), గుడుంబా శంకర్ (gudumba Shankar) సినిమాలు విడుదలైపోయాయి. తొలిప్రేమ ఇప్పటికే మూడుసార్లు విడుదలైంది. ఖుషి సినిమా రెండుసార్లు విడుదలైంది. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ రీ రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్తడే అంటే రీ రిలీజ్ చేయడానికి ఈ సినిమాలు తప్ప మరో సినిమా లేవు. మిగతావన్నీ భారీ డిజాస్టర్లు. దీనిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కష్టం మరి ఒకరికి రాకూడదు అని అనిపిస్తుంది.
Also Read: Lokesh Kanagaraj: ఆ ఒక్క ట్వీట్ కానీ వేస్తే, 1000 కోట్లు నడుచుకుంటూ వస్తాయి