BigTV English

Virat Kohli : కోహ్లీ ఈసారైనా సెంచరీ చేస్తాడా? పుట్టినరోజు కానుక ఇస్తాడా?

Virat Kohli  : కోహ్లీ ఈసారైనా సెంచరీ చేస్తాడా? పుట్టినరోజు కానుక ఇస్తాడా?

Virat Kohli : విరాట్ కోహ్లీ పేరు వినగానే…భారతీయుల్లో ఒక గర్వం తొణికసలాడుతుంది. వీడు మనోడు అనే భావన వస్తుంది. వన్డే వరల్డ్ కప్ 2023లో విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు.సచిన్ రికార్డ్‌కి చేరువగా వచ్చి నిలిచాడు. దురదృష్టం ఏమిటంటే మూడు మ్యాచుల్లో 80 పరుగులు దాటి సెంచరీ వరకు వచ్చి ఆగిపోయాడు. అవేగానీ సెంచరీలుగా మలచి ఉంటే ఈపాటికి సచిన్ (49) రికార్డ్ దాటేసి ప్రపంచ రికార్డ్ సృష్టించేవాడు. కానీ ఆగిపోయాడు.


వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ మీద మాత్రం అతికష్టమ్మీద ఒక సెంచరీ చేశాడు. అటువైపు ఎండ్ లో కేఎల్ రాహుల్ సహకారంతో దానిని పూర్తి చేశాడు. తర్వాత ఆడిన  శ్రీలంక (88), ఆస్ట్రేలియా (85), న్యూజీలాండ్ (95) చేసి సెంచరీ ముంగిట అవుట్ అయిపోయాడు. ఈరోజు విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు. సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న మ్యాచ్ లోనైనా తను సెంచరీ చేసి అభిమానులకు కానుకగా ఇస్తాడని అందరూ ఆశిస్తున్నారు. తర్వాత నెదర్లాండ్ తో మ్యాచ్ ఉంది. దానిమీద సింపుల్ గా చేశాడంటే 50 సెంచరీలు అయిపోతాయని కూడా చెబుతున్నారు.

ప్రస్తుతం వరల్డ్ కప్ లో కోహ్లీ మంచి ఫామ్ మీద ఉన్నాడు. ఇప్పటికి 442 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్లలో మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి ప్లేస్ లో సౌతాఫ్రికా ప్లేయర్ డికాక్ (545), రెండో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర (523) మూడో స్థానంలో కోహ్లీ ఉన్నాడు. వీరి తర్వాత 4వ స్థానంలో ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్ (428), తర్వాత ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (402) ఉన్నారు.


35 వడిలో పడుతున్న విరాట్ కోహ్లీకి,  36 ఏళ్ల రోహిత్ శర్మకి బహుశా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు. అందుకే ఇద్దరూ కూడా చరిత్రలో నిలిచిపోయేలా మనసు పెట్టి ఆడుతున్నారు. ఎలాగైనా కప్ కొట్టుకెళ్లాలనే ధృడ సంకల్పంతో ఉన్నారు. అందుకే తమ అనుభవాన్నంత ఉపయోగించి చక్కగా ఆడుతున్నారు. ఇండియా జట్టుని ఓటమన్నదే లేకుండా సెమీస్ కి తీసుకువెళ్లారు.వారిద్దరి ఆశ, 140 కోట్ల భారతీయుల ఆశ నెరవేరాలని ఆశిద్దాం.

Related News

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

Big Stories

×