BigTV English

India Vs England 4th Test: రాంచీలో ఊరిస్తున్న రికార్డులు.. తిరగ రాస్తారా..?

India Vs England 4th Test: రాంచీలో ఊరిస్తున్న రికార్డులు.. తిరగ రాస్తారా..?
Latest sports news today

India vs England 4th Test : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ రేపు రాంచీలో జరగనుంది. ఇప్పటికే 2 టెస్ట్ మ్యాచ్‌లు నెగ్గి ఆధిక్యంలో ఉన్న భారత్ రేపటి నిర్ణయాత్మక మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ దక్కించుకోవాలి చూస్తోంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే అప్పుడు 2-2 తో రెండు జట్లు సమం అవుతాయి. అప్పుడు ఐదో టెస్ట్ మ్యాచ్ చావో రేవో అన్నట్టు మారిపోతుంది. అందుకే టీమ్ ఇండియా ఆటగాళ్లు ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గాలని పట్టుదలగా ఉన్నారు. ఈక్రమంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కొన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. అవేమిటో చూద్దాం రండి.

22 ఏళ్ల యువ సంచలనం యశస్వి జైశ్వాల్


భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కి 15 ఇన్నింగ్స్‌ల వద్ద ఒక రికార్డ్ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం 13 ఇన్నింగ్స్‌లలో తను 861 పరుగులు చేశాడు. అయితే తనకన్నా ముందు ఇంగ్లాండ్‌కు చెందిన హెర్బర్ట్ తన మొదటి 15 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 1017 పరుగులు చేసి ఉన్నాడు. ఇప్పుడు తనకి కేవలం 156 పరుగుల దూరంలో ఉన్నాడు.

Read More: ఐపీఎల్‌ కు షమీ దూరం.. గుజరాత్‌కు షాక్‌..


దీంతో పాటు సుదీర్ఘమైన ద్వైపాక్షిక సిరీస్‌లో కింగ్ కొహ్లీ 692 పరుగులు చేసి ఉన్నాడు. జైశ్వాల్ ఇప్పటికి మూడు టెస్టు మ్యాచ్‌ల్లో కలిపి 545 పరుగులు చేశాడు. తనింకా 147 పరుగుల దూరంలోనే ఉన్నాడు. అయితే దీనికింకా సమయం ఉంది. మరో టెస్ట్ మ్యాచ్ అవకాశం ఉంది. కానీ పైన చెప్పిన 15 తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో రికార్డు ఛేదించాలంటే మాత్రం కచ్చితంగా 156 పరుగులు చేయాల్సి ఉంది.
అలా చేస్తే ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు రెండు రికార్డులు బద్దలైపోతాయి.

అశ్విన్ చెంత ఒక రికార్డు

వెటరన్ ఆటగాడు అశ్విన్‌కు ఇంగ్లాండ్‌పై 100 టెస్టు వికెట్లు సాధించే అవకాశం లభించింది. ఈ మైలురాయిని చేరుకోవడానికి కేవలం ఒక వికెట్ దూరంలోనే ఉన్నాడు. ఇది సాధిస్తే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా అవతరిస్తాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ ముందు రికార్డులు

36 ఏళ్ల  రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌పై 1000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 13 పరుగుల దూరంలో ఉన్నాడు. 600 సిక్సర్లు కొట్టిన అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ, మరి బౌండరీలతో కూడా సాధిస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇలా పలు రికార్డులు మన క్రికెటర్ల వెనుకే ఉన్నాయి. వాటిని సాధిస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Related News

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

IND Vs AUS : ఆస్ట్రేలియాతో సిరీస్… టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్

Asia Cup 2025 : టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు…గంభీర్ పై సంజూ సీరియస్?

Pak vs Ban: ఇవాళే బంగ్లా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌…గెలిస్తే ఫైన‌ల్స్‌, ఓడితే ఇంటికే

BCCI: బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇక ఈ ఇద్ద‌రూ పాక్‌ క్రికెట‌ర్ల కెరీర్ క్లోజ్‌

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

Big Stories

×