BigTV English

PM Modi in Gujarat: వాలినాథ్ ధామ్ ఆలయం ప్రారంభోత్సం.. అమూల్ స్వర్ణోత్సవ వేడుకలు

PM Modi in Gujarat: వాలినాథ్ ధామ్ ఆలయం ప్రారంభోత్సం.. అమూల్ స్వర్ణోత్సవ వేడుకలు

PM Modi Gujarat Tour Updates: ప్రధాని నరేంద్ర మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నరు. వాలినాథ్ ధామ్ ఆలయాన్ని ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పలు పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలను ప్రారంభించారు.


డెయిరీ రంగానికి మహిళలు వెన్నెముక అని మోదీ అన్నారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి ప్రతి మహిళ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలన్నారు. ముద్రా యోజన కింద 70 శాతం మంది మహిళలకు రూ. 30 లక్షల కోట్లకుపైగా సహాయం అందించామని గుర్తు చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంలో కేంద్ర ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతను చూపిస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 60,000 పైగా అమృత్ సరోవర్ల నిర్మాణాన్ని ప్రస్తావించారు. రైతులను ఆదుకోవడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాలను వివరించారు. ఈ కార్యక్రమం రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా రూపొందించామని ప్రధాని మోదీ అన్నారు.


Read More: ఢిల్లీలో సీట్లసర్దుబాటు కొలిక్కి.. ఆప్‌ కి నాలుగు.. కాంగ్రెస్‌కి మూడు..

అమూల్‌కు మోదీ ప్రశంసలు తెలిపారు. భారత స్వతంత్రం తర్వాత దేశంలో అనేక బ్రాండ్లు ఆవిర్భవించాయని పేర్కొన్నారు. అయితే విశ్వాసం, అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, రైతు సాధికారత ఆత్మనిర్భర్ భారత్ కోసం స్ఫూర్తికి పర్యాయపదంగా మారిన అమూల్ లాంటి బ్రాండ్ మరొకటి లేదని స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం సంవత్సరానికి 6 శాతం వృద్ధి చెందుతోందని తెలిపారు. సంవత్సరానికి 2 శాతం అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పాడి పరిశ్రమను అధిగమించిందన్నారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×