BigTV English

Surya: ఇక టెస్టుల్లోకి సూర్య?

Surya: ఇక టెస్టుల్లోకి సూర్య?

Surya : టీమిండియా స్టార్‌ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నాడా? ఔననే అంటున్నాయి… BCCI వర్గాలు. T20 క్రికెట్లో ప్రత్యర్థుల్ని ఊచకోత కోస్తున్న సూర్యకు… బంగ్లాదేశ్‌ పర్యటనలో టెస్టుల్లో ఛాన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే… బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా… గాయం కారణంగా ఇబ్బంది పడుతుండటంతో… అతని స్థానంలో సూర్యను పంపే అవకాశం ఉందంటున్నారు.


కొన్నాళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్న రవీంద్ర జడేజా… ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెబుతున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్‌ పర్యటన మొదలయ్యే సమయానికి జడ్డూ పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోతే… మరోసారి జట్టుకు దూరం కాక తప్పదు. దాంతో… అతనికి ప్రత్యామ్నాయం వెతుకుతోంది… BCCI. ప్రస్తుతం జడ్డూకు ప్రత్యామ్నాయంగా అనేక మంది ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నా… స్పెషలిస్టు స్పిన్నర్‌ కావాలనుకుంటే మాత్రం సౌరభ్‌ కుమార్‌కు ఛాన్స్ దక్కవచ్చని చెబుతున్నారు. అలా కాకుండా బ్యాటరే కావాలనుకుంటే… సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.

టెస్టుల్లో సూర్య ఇప్పటిదాకా ఎంట్రీ ఇవ్వకపోవడం, ఇటీవలి T20 వరల్డ్ కప్ లో రాణించడంతో పాటు న్యూజిలాండ్ పర్యటనలో అద్భుత సెంచరీ చేయడంతో… జడేజా స్థానాన్ని సూర్యతో భర్తీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబరు 14 నుంచి బంగ్లాదేశ్‌-టీమిండియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించినా… ఫిట్‌నెస్‌ కారణాలతో జడేజా దూరమైతే మాత్రం… కొత్తగా ఏర్పడే సెలక్షన్‌ కమిటీ సూర్యకు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.


దేశవాళీ క్రికెట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు మెరుగైన రికార్డు ఉంది. అనేక టోర్నీల్లో సూర్య 5 వేల పరుగులకు పైగా చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 26 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. T20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్ స్థానంలో ఉన్న సూర్య… త్వరలోనే టెస్టు జట్టులోనూ చేరతానని ఇటీవల ధీమా వ్యక్తం చేశాడు. దాంతో… టెస్టుల్లోనూ సూర్యకు ఛాన్స్ ఇవ్వాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

    Related News

    Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

    Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

    Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

    James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

    Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

    Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

    Big Stories

    ×