BigTV English

ICC World Cup : వీళ్లకిదే ఆఖరి వరల్డ్ కప్ అవుతుందా?

ICC World Cup : వీళ్లకిదే ఆఖరి వరల్డ్ కప్ అవుతుందా?
Cricket world cup latest news

Cricket world cup latest news(Indian cricket news today) :

మొత్తానికి 2023 వన్డే వరల్డ్ కప్ ఇండియాని ఊరించి, ఊరించి ఉసూరుమనిపించింది. అంతవరకు పదికి పదింట టీమిండియా అద్భుతంగా ఆడి ఆడాల్సిన ఆఖరి మ్యాచ్ లో తేలిపోవడంతో 140 కోట్ల మంది  భారతీయులు ఒక్కసారి ఉసూరుమన్నారు. కానీ అంతవరకు గొప్పగా ఆడిన మనవాళ్లని అభినందిస్తూనే బాధపడ్డారు.


ఇక్కడ మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు వరల్డ్ కప్ ఆడిన టీమ్ ఇండియాలో ఒక ఐదుగురు ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్ కప్ లా అనిపిస్తోంది. నిజానికి గెలిచి ఉంటే వారందరి కల తీరేది. ఒక ఆటగాడిగా ప్రపంచకప్ గెలిచిన టీమ్ లో సభ్యుడిగా ఉండి ఉంటే చరిత్రలో నిలిచిపోయేవారు. ఆ అవకాశం తృటిలో చేజారిపోయింది. ఇంతకీ టీమ్ ఇండియాలో ఆ ప్లేయర్లు ఎవరంటే..

కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ


మొదటగా కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పాలి. ఇప్పటికి తన వయసు 36 సంవత్సరాలు. 2027 వరల్డ్ కప్ కి అతని వయసు 40 అవుతుంది. ఇప్పటికే ఫిట్ నెస్ సమస్యలతో ఉన్న రోహిత్ కి బహుశా ఆఖరి వరల్డ్ కప్ ఇదేనని చెప్పాలి. 2011 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో చోటు దక్కలేదనే బాధ ఉందని చెప్పే రోహిత్.. ఆ కల తీరకుండానే ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అవకాశాలున్నాయి.

మెమరబుల్ బౌలర్ మహ్మద్ షమీ

2023 వరల్డ్ కప్ లో ఆడినవి తక్కువే మ్యాచ్ లే అయినా అందరికీ గుర్తుండిపోయేలా ఆడినా ఆటగాళ్లలో ఒకడిగా మహ్మద్ షమీ ఉన్నాడు. ఇప్పుడు తన వయసు 33 సంవత్సరాలు. ఒకరకంగా చెప్పాలంటే 37 ఏళ్ల వయసులో అంత ఫిట్ నెస్ తో ఉంటాడని చెప్పలేం. అందువల్ల దాదాపు ప్రపంచకప్ టోర్నమెంట్ కి గుడ్ బై చెప్పేసినట్టే. కానీ ప్రపంచకప్ గెలవకపోతేనేం ఒక బౌలర్ చరిత్రలో నిలిచిపోయేలా ఆడిన ఘనత తనకే దక్కుతుంది.

అందరినీ నవ్విస్తూ నవ్వించే రవీంద్ర జడేజా

33 ఏళ్ల రవీంద్ర జడేజా వయసు అప్పటికి 37 సంవత్సరాలు అవుతుంది. ఈ నాలుగేళ్లు ఆడితే అశ్విన్ తరహాలో 15 మంది జట్టులో చోటు దక్కించుకోవచ్చు. కానీ చెప్పలేం. తను కూడా ఏక్సిడెంట్ అయి ఫిట్ నెస్ సమస్యలతో ఉన్నాడు. నాలుగేళ్లు కొనసాగిస్తాడని గ్యారంటీ లేదు. కేవలం రోహిత్ శర్మ, కొహ్లీ వీరితో సాన్నిహిత్యం, ఫీల్డింగ్ విన్యాసాల కారణంగా తను కొనసాగుతున్నాడు. గేమ్ లో ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండే రవీంద్ర జడేజా జట్టులో ఉంటే అదొక ఆనందం. అది లేకపోవడం తోటి ఆటగాళ్లకే కాదు, భారతీయులకి నిరాశే అని చెప్పాలి.

చిన్ని చిన్ని ఆశ..కొహ్లీ

ఫిట్ నెస్ లో మేటి అయినా విరాట్ కొహ్లీకి మాత్రం చిన్న ఆశ ఎక్కడో మిణుకుమిణుకు మంటూ వెలుగుతోంది. ఇప్పుడు కొహ్లీ వయసు 35 సంవత్సరాలు. వచ్చే నాలుగేళ్లకి 39 అవుతుంది. సచిన్ 100 సెంచరీలు దాటాలంటే, ఇంకా విరాట్ కి 20 కావాలి. ఇప్పుడు 80 మీద ఉన్నాడు. అవి చేస్తూ ఫిట్ నెస్ తో ఉంటే మాత్రం తప్పకుండా జట్టులో ఉంటాడు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ లో టాప్ స్కోర్ బ్యాటర్ కావడం తనకి కలిసి వస్తుంది.

దేశం కోసం కష్టపడి ఆడాలని భావించే..అశ్విన్

అశ్విన్ కి ఇప్పుడే 37 సంవత్సరాలు. వచ్చే వరల్డ్ కప్ నాటికి 41 అవుతాయి. బహుశా 2023 వరల్డ్ కప్ తో అశ్విన్ కథ ముగిసిందనే చెప్పాలి. కానీ అశ్విన్ మాత్రం కొత్తగా వచ్చే యువ క్రికెటర్లకి ఒక ఇన్సిపిరేషన్. ఫీల్డ్ లోకి వచ్చాడంటే ఎప్పుడు కూడా సరదాగా ఆడదు. దేశం కోసం ఆడాలనే తపనతోనే కనిపిస్తాడు. బౌలర్ గానే బ్యాట్స్ మెన్ గా కూడా చివర్లో వచ్చి జట్టుకెన్నో విజయాలందించిన గుర్తులు చాలానే ఉన్నాయి.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×