E-Paper
Advertisement

Bethavolu canal: ఊడిన కాలువ షట్టర్.. నీట మునిగిన పంటలు..

Bethavolu canal: ఊడిన కాలువ షట్టర్.. నీట మునిగిన పంటలు..
Advertisement
Bethavolu canal

Bethavolu canal: నాగార్జున సాగర్ ఎడమ కాలువపై నిర్మించిన బేతవోలు వరద కాలువ ఎస్కేప్ షట్టర్ ఊడిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. షట్టర్ ఊడిపోవడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న పొలాలన్నీ నీట మునిగాయి. కోత కోసిన పంట కల్లాల్లోనే ఉండటంతో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన మునగాల మండల పరిధిలోని రైతులకు అపార నష్టం కలిగించింది.

ఈ తెల్లవారుజామున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు, సూపరిండెంట్ ఇంజనీర్ నరసింహ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వరద కాలువకు నీటి సరఫరా ఆపేశారు. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగింది. బేతవోలు చెరువును నింపేందుకే జేసీబీతో షట్టర్ తెరిచినట్లు చిలుకూరు మండల పరిధిలోని పోలేనిగూడెం రైతులు ఆరోపిస్తున్నారు. ఇది కుట్రలో భాగంగానే జరిగిందని రైతులు ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తే నీటిపాలయ్యిందని.. షట్టర్ తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేసారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×