E-Paper
Advertisement

రన్స్ చేయకపోతే..గొంతు నొక్కి చంపేస్తానని సచిన్ కు వార్నింగ్ ఇచ్చా !

రన్స్ చేయకపోతే..గొంతు నొక్కి చంపేస్తానని సచిన్ కు వార్నింగ్ ఇచ్చా !
Advertisement

Sunil Gavaskar warns Sachin:  లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టన్నుల కొద్ది పరుగులు చేసి.. క్రికెట్ గాడ్ గా పేరు తెచ్చుకున్నారు సచిన్. సెంచరీలు అలాగే అర్థ సెంచరీలు చేసి కూడా సరికొత్త రికార్డులు సృష్టించారు. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన సచిన్ టెండూల్కర్ ను ఒకానొక సమయంలో బెదిరించాల్సిన అవసరం వచ్చిందని తాజాగా సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. పరుగులు చేయకపోతే గొంతు పిసికి చంపేస్తానని.. సచిన్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తాజాగా గుర్తు చేశారు. అయితే తన వార్నింగుకు భయపడిన సచిన్.. సరిగ్గా ఆడాడని గుర్తు చేశారు. ట్రాక్ తప్పకుండా బ్యాటింగ్ చేసి.. ఉన్నత స్థానాలకు ఎదిగారని ప్రశంసించారు సునీల్ గవాస్కర్.

1990లోనే సచిన్ టెండుల్కర్ కు వార్నింగ్ ఇచ్చిన సునీల్ గవాస్కర్

టీమిండియాలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కంటే సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) చాలా సీనియర్ ప్లేయర్. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ కు 1990 లోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సునీల్ గవాస్కర్. సచిన్ టెండూల్కర్ ఊపు చూసి.. అతని కెరీర్ లో 15 వేల టెస్టు పరుగులు చేయాలని తాను కండిషన్ పెట్టినట్లు వ్యాఖ్యానించారు. అలాగే 40 టెస్ట్ సెంచరీలు సాధించకపోతే… గొంతు నొక్కేస్తానని హెచ్చరించినట్లు గుర్తు చేశారు సునీల్ గవాస్కర్. తన 17వ ఏటా సచిన్ టెండూల్కర్ అసాధారణ ప్రతిభ చూపించారని గుర్తు చేశారు. ప్రపంచ క్రికెట్ ను సచిన్ టెండూల్కర్ ఏలుతాడన్న విషయాన్ని గ్రహించి, అతని ముందు లక్ష్యాన్ని పెట్టినట్లు వివరించారు. ఇక తాను చెప్పినట్లుగానే సచిన్ టెండూల్కర్ అడుగులు వేశారని వివరించారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

గవాస్కర్ వార్నింగ్ కు భయపడిన సచిన్ టెండూల్కర్

సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) వార్నింగ్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రానించి టీమిండియా ను ముందుకు సాగించారు. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ఇచ్చే వరకు సచిన్ టెండూల్కర్ 15, 921 టెస్ట్ పరుగులు సాధించారు. అలాగే 51 టెస్ట్ సెంచరీలు కూడా పూర్తిచేసి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు మొత్తం 200 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈ సందర్భంగా 15921 పరుగులు సాధించి.. 53.78 యావరేజ్ సంపాదించాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. వన్డే విషయానికి వస్తే 463 మ్యాచ్ లు ఆడాడు. ఈ క్రమంలో 18,426 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 49 సెంచరీలతో పాటు 44.83 యావరేజ్ సాధించాడు. అదే సమయంలో ఒకే టి20 ఆడాడు. ఇందులో 10 పరుగులు చేశాడు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

అనిల్ కుంబ్లే కుక్క కంటే హీనంగా కోహ్లీ ట్రీట్ చేసాడు..!

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి

40 ఏళ్ళ రోహిత్ ను తీసుకున్నప్పుడు, షమీని ఉగ్రవాదిలా ఎందుకు ట్రీట్ చూస్తున్నారు ?

కోచ్ వహాబ్ రియాజ్ తో పాకిస్తాన్ లేడీ క్రికెటర్ డేటింగ్…స్టేడియంలోనే రొమాన్స్ !

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

Big Stories

Advertisement
×