BigTV English
Advertisement

Netherlands vs South Africa : నెదర్లాండ్స్ సంచలన విజయం.. దక్షిణాఫ్రికా విలవిల..

Netherlands vs South Africa : నెదర్లాండ్స్ సంచలన విజయం..  దక్షిణాఫ్రికా విలవిల..

Netherlands vs South Africa: ప్రపంచకప్ 2023లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చిన్నజట్లు మోత మోగిస్తున్నాయి. మొన్న ఆఫ్గాన్ చేతిలో ఇంగ్లాండ్ ఓటమిని మరిచిపోకముందే, నేడు డచ్ చేతిలో దక్షిణాఫ్రికా చావుదెబ్బ తిన్నాది.


వివరాల్లోకి వెళితే… వర్షం కారణంగా 43 ఓవర్లకి నెదర్లాండ్- దక్షిణాఫ్రికా మ్యాచ్ ని కుదించారు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 43 ఓవర్లకు 245 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన దక్షిణాఫ్రికా 207 పరుగులకే చేతులెత్తేసింది. చివరికి 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ చూసిన  క్రీడాభిమానులంతా ,చాలాసేపు షాక్ నుంచి తేరుకోలేకపోయారు.

హిమాచల్ ప్రదేశ్ లో హెచ్ పీసీఏ స్టేడియంలో జరిగిన నెదర్లాండ్స్- దక్షిణాఫ్రికా మ్యాచ్ లో పెను సంచలనం నమోదైంది.  ప్రపంచకప్ క్రికెట్ లో అతిచిన్న జట్టు అయిన నెదర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికా  ఓటమి పాలైంది. అయితే మ్యాచ్ కి ముందు వర్షం పడటమే వీరికి శాపంగా మారిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ ని 43 ఓవర్లకి కుదించారు. 


టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ కి ఆరంభంలో అద్భుతాలేమీ జరగలేదు. ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్ (2), మాక్స్ ఔడౌడ్ (18) త్వరత్వరగానే పెవెలియన్ దారి పట్టారు. 24 పరుగులకి 2 వికెట్లతో పతనం దిశగా సాగిపోతున్నట్టు కనిపించింది. ఈళ్ల వాలకం చూస్తుంటే 100 పరుగుల లోపే అయిపోతారని ఒకదశలో అంతా అనుకున్నారు.

క్రీడా పండితుల జోస్యం నిజమనిపించేలా ఫస్ట్ డౌన్ వచ్చిన బాస్ డీ లీడే (2), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు కోలిన్ (13) సైబ్రాండ్ (19) కూడా క్యూ కట్టీశారు. 

ఇలా ఒకదశలో 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. బౌలర్లు కూడా మిగిలిన లాంఛనం పూర్తి చేస్తారని అనుకున్నారు. 

కానీ అప్పుడొకడు వచ్చాడు. అతనే డచ్ టీమ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్. 

వచ్చీ రాగానే ఎడా పెడా బాదేయడం మొదలు పెట్టాడు. తనని తాను నియంత్రించుకుంటూనే అవకాశం వచ్చినప్పుడల్లా ఫోర్లు, సిక్సులు వడ్డిస్తూ పోయాడు. అలా 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 69 బంతుల్లో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి చివర్లో బౌలర్లు వాన్ డెర్ మెర్వే (29), ఆర్యన్ దత్ (23) అందించిన సహకారంతో 43 ఓవర్లలో 245 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచారు.
దక్షిణాప్రికా బౌలర్లలో రబాడా 2, ఏంగిడి 2, జాన్సన్ 2 వికెట్లు పడగొట్టారు.

అయితే సఫారీలకు ఏం జరిగిందో అర్థమయ్యేసరికి…జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సెకండ్ బ్యాటింగ్ కి వచ్చి ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేకపోయారు. పిల్ల జట్టు నెదర్లాండ్స్ బౌలర్లను ఎదుర్కోలేక గిలగిల్లాడారు. వికెట్ల ముందు బ్యాట్ ని అడ్డు పెట్టి డిఫెన్స్ ఆడుతూ మరీ అవుట్ అయిపోయారు.

అదే విచిత్రంగా అందరికీ అనిపించింది.
 ఓపెనర్లు బావుమా (16), క్వింటన్ డికాక్ (20), వాండర్ డసెన్ (4), మార్ క్రమ్ (1) ఈ నలుగురు 10.2 ఓవర్లలో అవుట్ అయిపోయారు. అప్పటికి స్కోరు 44 పరుగులకి 4 వికెట్లుగా నిలిచింది. మంచి ఫ్యాన్సీ నెంబర్ వచ్చిందని అంతా అనుకున్నారు.

ఈ ఫ్యాన్సీ నెంబర్ నుంచైనా మ్యాచ్ టర్న్ అవుతుందని సగటు క్రికెట్ అభిమానులు ఆశించి భంగపడ్డారు. వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. అభిమానుల సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. తర్వాత వచ్చిన హెన్నిచ్ క్లాసెన్ (28) పై అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి నెత్తిమీద నీళ్లు జల్లి తను వెళ్లిపోయాడు. తర్వాత మార్కో జాన్సన్ (9), గెరాల్డ్ (22) కూడా అదే దారిలో వెళ్లారు. చివర్లో కొంత ఆశ కనిపించినా…ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్న చందంగా పరిస్థితి మారిపోయింది. చివరికి 207 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా కథ ముగిసిపోయింది. .
మ్యాచ్ లో మాత్రం డేవిడ్ ముల్లర్ (43), కేశవ్ మహరాజ్ (40) మాత్రమే చెప్పుకోతగ్గ రీతిలో ఆడారు. మిగిలిన వారు ఇదే తరహాలో ఆడి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
డచ్ టీమ్ లో వాన్ లీక్ 3 వికెట్లు తీశాడు. వాన్ డెర్ మెర్వే, డి లీడే, మెకరన్ తలో రెండు వికెట్లు తీశారు.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×