BigTV English

ICC : శ్రీలంకలో ప్రపంచకప్ రద్దు.. ఐసీసీ కీలక నిర్ణయం..

ICC : శ్రీలంకలో ప్రపంచకప్ రద్దు.. ఐసీసీ కీలక నిర్ణయం..
ICC

ICC: వన్డే వరల్డ్ కప్ 2023లో ఒక చేదు జ్ఞాపకం ఏమిటంటే శ్రీలంక క్రికెట్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచకప్ లో చెత్తగా ఆడటం వల్ల ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ అత్యుత్సాహంతో ఆ దేశ క్రికెట్ బోర్డుని రద్దు చేసి పారేసింది. బోర్డు సభ్యులని తీసేశారు. వెంటనే అర్జున రణతుంగను నియమించారు. కాకపోతే ఇది ఐసీసీకి కోపం తెప్పించింది.


క్రికెట్ బోర్డులన్నీ స్వయం ప్రతిపత్తికలిగి ఉండాలి. అంతేగానీ ప్రభుత్వాల నియంత్రణలో కాదనేది ఐసీసీ రూల్. ఒకవేళ బోర్డుని రద్దు చేయాలని అంటే, అది ఐసీసీకి చెప్పి చేయాలి. లేదా వారి అనుమతి తీసుకోవాలి. అంతేగానీ ఐసీసీని పక్కన పెట్టి, నీ బోడి పెత్తనం ఏమిటి? అనకూడదు. ఇప్పుడదే ఐసీసీ పెద్దలు ఫీలయ్యారు. తమని సైడు వేస్తేస్తే ఎలా? అని ఆగ్రహం తెచ్చుకున్నారు.

ఇప్పుడు వీరిని ఉపేక్షిస్తే ప్రతి దేశం కూడా క్రికెట్ బోర్డుల్లో వేలు పెడుతుంది. అప్పుడు నాణ్యమైన క్రికెట్ బయటకు రాదు. అంతా రికమండేషన్ క్యాండిట్లే వస్తారు. అప్పుడు ఆడి కూడా అనవసరం. శ్రీలంకలా 55 పరుగులకే ఆలౌట్ అయిపోతుంటారని ఒకరు నెట్టింట కామెంట్ చేశాడు.


అందుకే ప్రభుత్వాల నియంత్రణ బోర్డులపై ఉండకూడదని ఐసీసీ నిబంధన పెట్టింది. అలా ఉన్నవాటికే ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో  ఆడేందుకు అనుమతి ఇస్తుంది. ఈ విషయమై పునరాలోచించమని శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రిక్వెస్ట్ లెటర్ వెళ్లింది. అయినా సరే, వాళ్లు క్షమించలేదు. అండర్ 19 వరల్డ్ కప్ వేదికను శ్రీలంక నుంచి మార్చి పారేశారు. సౌతాఫ్రికాలో నిర్వహించనున్నారు.

దీంతో క్రికెట్ ఆడే దేశాలు కంగుతిన్నాయి. కొంచెం ఐసీసీతో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యాయి. అహ్మదాబాద్‌లో జరిగిన భేటీలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని టోర్నీలో పాల్గొనే జట్లకు తెలియజేశారు. 2020లో  అండర్-19 ప్రపంచకప్‌  దక్షిణాఫ్రికాలోనే జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా అక్కడే జరగనుంది. అయితే ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో శ్రీలంక దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌పై ఎటువంటి ప్రభావం ఉండదు’ అని ఐసీసీ బోర్డు వర్గాలు తెలిపాయి.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×