BigTV English

Worst record in T20s: T20ల్లో అత్యంత చెత్త రికార్డు

Worst record in T20s: T20ల్లో అత్యంత చెత్త రికార్డు

Worst record in T20s:ధనాధన్ బ్యాటింగ్‌కు మారుపేరైన T20 క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అయిదే అది ఇంటర్నేషనల్ T20 మ్యాచ్‌లో కాదు. IPL తర్వాత ఆ రేంజ్ ఆదరణ ఉన్న ప్రతిష్టాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆ దారుణమైన, ఘోరాతి ఘోరమైన రికార్డు నమోదైంది. సిడ్నీ థండర్‌ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్‌ అయి… T20 క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఆలౌటైన జట్టుగా నిలిచింది. ఇంతకుముందు 2019లో రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌట్ కాగా… ఇప్పుడా రికార్డును సిడ్నీ థండర్ తుడిచిపెట్టేసింది.


0, 0, 3, 0, 2, 1, 1, 0, 0, 4, 1… ఇవీ సిడ్నీ థండర్ జట్టులోని 11 మంది ఆటగాళ్లు చేసిన పరుగులు. ఇప్పటికే ఓసారి బిగ్‌బాష్‌ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్‌ జట్టు… అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంత దారుణంగా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో సిడ్నీ థండర్ జట్టు T20 క్రికెట్ చరిత్రలోనే తలదించుకునే రికార్డు నమోదు చేసింది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ 139 రన్స్ చేసింది. 140 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సిడ్నీ థండర్ టీమ్… అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆలౌటై కూర్చుంది. కేవలం 5.5 ఓవర్లలోనే 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. సిడ్నీ థండర్ స్కోరులో ఎక్స్‌ట్రా రన్స్ 3 పరుగులు. అడిలైడ్ స్ట్రైకర్స్ అవి కూడా ఇవ్వకపోయి ఉంటే… సిడ్నీ థండర్ 12 పరుగులకే ఆలౌటయ్యేది.


T20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్లుగా పేరున్న అలెక్స్‌ హేల్స్, రిలీ రోసో లాంటివాళ్లు సిడ్నీ జట్టులో ఉన్నా… కనీసం ఒక్కరు కూడా పరిస్థితిని బట్టి నిలబడేందుకు గానీ, కౌంటర్‌ అటాక్‌తో పరుగులు రాబట్టేందుకు గానీ ప్రయత్నించలేదు. పదో నంబర్‌ బ్యాటర్‌ డాగెట్‌ బ్యాట్‌కు బంతి ఎడ్జ్‌ తీసుకొని ఒకే ఒక ఫోర్‌ వచ్చింది. మొత్తం 35 బంతుల్లోనే సిడ్నీ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. అత్యంత దారుణమైన ఈ ఆటను జీర్ణించుకోలేకపోయిన స్టేడియంలోని ప్రేక్షకులు… అందరూ నిలబడి వ్యంగ్యంగా ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ ఇచ్చారు.

అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ హెన్రీ థార్టన్ 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా… వెస్‌ అగర్‌ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో థండర్‌పై 124 పరుగుల తేడాతో గెలిచింది… అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×