BigTV English

Manchu Manoj: కొత్త సంవ‌త్స‌రంలో మ‌నోజ్ కొత్త జీవితం మొద‌లు!

Manchu Manoj: కొత్త సంవ‌త్స‌రంలో మ‌నోజ్ కొత్త జీవితం మొద‌లు!

Manchu Manoj:కొత్త సంవ‌త్స‌రంలో మంచు మ‌నోజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న క‌డ‌ప వేదిక‌గా అనౌన్స్ చేశారు. అయితే కొత్త జీవితం అన‌గానే అంద‌రూ పెళ్లి గురించేనా? అని అనుకుంటారు. అయితే, ఆ ప‌దం వాడ‌కుండా పెళ్లి గురించి చెప్పేశారు మంచు మ‌నోజ్. భూమా మౌనిక‌తో ఇంత‌కు ముందు కూడా వినాయ‌కుడి మంట‌పాల‌ను ద‌ర్శించుకున్నారు మ‌నోజ్‌. ఆమెనే వివాహం చేసుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు తాజాగా క‌డ‌ప ద‌ర్గాను సంద‌ర్శించుకున్న త‌ర్వాత మ‌రోసారి భూమా మౌనిక పేరు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మంచు మ‌నోజ్‌కి ఇదివ‌ర‌కే వివాహం జ‌రిగింది. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు. భూమా మౌనిక‌కు కూడా ఇది వ‌ర‌కే వివాహం జ‌రిగింది. ఆమె కూడా వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల విడాకులు తీసుకున్నారు.


మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక‌కు ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉంది. ఇప్పుడు ఆ ప‌రిచ‌య‌మే వివాహానికి దారి తీస్తోంద‌ని అంటున్నారు స‌న్నిహితులు. మ‌రోవైపు కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ప్రాజెక్టుల‌ను కూడా మొద‌లుపెట్ట‌నున్నారు మంచు మ‌నోజ్‌. అహం బ్ర‌హ్మస్మి అనే ప్రాజెక్టును ఆల్రెడీ అనౌన్స్ చేశారు మ‌నోజ్‌. ఈ సినిమాకు సంబంధించిన లుక్కుల‌ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను పూర్తి స్థాయిలో సెట్స్ మీద‌కు తీసుకెళ్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌న‌వ‌రి నుంచి కాకుండా ఫిబ్ర‌వ‌రి నుంచి ఆయ‌న త‌దుప‌రి సినిమాల షూటింగులు సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్నాయి. ఇక తాను చేసేవ‌న్నీ ప్యాన్ ఇండియా సినిమాలేన‌ని ఇదివ‌ర‌కే చెప్పారు మంచు మ‌నోజ్‌.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×