E-Paper
Advertisement

Radha yadav Hit Wicket:WPL 2026 ఫైనల్ లో హిట్ వికెట్ వివాదం..మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ RCBపై ఆరోప‌ణ‌లు

Radha yadav Hit Wicket:WPL 2026 ఫైనల్ లో హిట్ వికెట్ వివాదం..మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ RCBపై ఆరోప‌ణ‌లు

Radha yadav Hit Wicket:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అందరూ ఊహించినట్లుగానే ఛాంపియన్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా అందించిన రాయల్ ఛాలెంజర్స్ మహిళల బెంగళూరు జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చిత్తు చేసి, రెండోసారి ఛాంపియన్ గా అవతరించింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఛేజింగ్ చేసే క్రమంలో బెంగళూరు ప్లేయర్ రాధా యాదవ్ ఓ బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించారు. ఆ సమయంలో రాధా యాదవ్ ( Radha Yadav) హిట్ వికెట్ అయిందని, అయినప్పటికీ అంపైర్లు ఔట్ గా ప్రకటించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

రాధా యాదవ్ హిట్ వికెట్ వివాదం.. బెంగళూరు ఫిక్సింగ్ చేసిందా ?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( WPL 2026 Final Controversy ) భాగంగా నిన్న ఫైనల్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Royal Challengers Bengaluru Women vs Delhi Capitals Women, Final) మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన బెంగుళూరు, రెండోసారి ఛాంపియన్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, అద్భుతంగా రాణించింది బెంగళూరు. 19.4 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసి గెలిచింది.

అయితే ఆ సమయంలో రాధా యాదవ్ ఓ బౌండరీ కొట్టి మ్యాచ్ గెలిపించారు. అయితే బౌండరీ కొట్టిన సమయంలో మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.19.4వ బంతికి రాధా యాదవ్ బౌండరీ కొట్టారు. అయితే ఆమె ఆ సమయంలో హిట్ వికెట్ ( Radha yadav hit wicket) అయినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆమె బౌండరీ కొట్టేటప్పుడు వెనకాల వికెట్ బెల్స్‌ పడిపోయాయి. దీంతో రాధా యాదవ్ హిట్ వికెట్ అయ్యారని, అది చూసుకోకుండా బౌండరీ ఇచ్చింది అంపైర్లు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంపైర్లు బెంగళూరు జట్టుకు అమ్ముడుపోయారని.. ఈ ఫైనల్స్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కొత్త న్యూస్ తెరపైకి వచ్చింది.

అసలు వాస్తవం ఇదే

ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్ లో రాధా యాదవ్ బౌండరీ కొట్టిన మాట వాస్తవమే. కానీ ఆమె హిట్ వికెట్ కాలేదు. వెనకాల ఉన్న వికెట్ కీపర్ తన గ్లౌజు ద్వారా బెల్స్‌ కింద పడేసింది. దాంతో రాధా యాదవ్ హిట్ వికెట్ అయిందని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్ జరగలేదని వీడియోలు బయటకు వస్తున్నాయి. క్లారిటీగా చూస్తే మనకు కూడా అదే అర్థమవుతుంది. అందుకే అంపైర్లు క్లియర్ గా బౌండరీ ఇచ్చేశారు.

Also Read: Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

 

 

?igsh=MXE2eHhqMDRkZjcwYg==

 

?utm_source=ig_web_copy_link

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×