BigTV English

WTC Final : నేటి నుంచి ఫైనల్ సమరం.. గద దక్కేదెవరికి?

WTC Final : నేటి నుంచి ఫైనల్ సమరం.. గద దక్కేదెవరికి?

WTC Final : నేడు భారత్ – ఆస్ట్రేలియాల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ సమరం ప్రారంభంకానుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ పిచ్ పేసర్లకు సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ ను భారత్ బ్యాటర్లకు ఆసీస్ పేసర్లకు మధ్య సమరంగా భావిస్తున్నారు.


భారత్ జట్టు కూర్పుపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ , శుభ్ మన్ గిల్ బరిలోకి దిగుతారు. వన్ డౌన్ లో పుజారా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రహనే వస్తారు. కీపర్ గా కేస్ భరత్, ఇషాన్ కిషన్ లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. టీమ్ మేనేజ్ మెంట్ భరత్ వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టులో ఎంతమంది స్పిన్నర్లకు అవకాశం ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

జడేజా, అశ్విన్ ఇద్దర్నీ తుది జట్టులోకి తీసుకుంటారా..? లేక ఒకరికే అవకాశం దక్కుతుందా ? అనే దానిపై స్పష్టతలేదు. ఒకే స్పిన్నర్ ను తీసుకుంటే అప్పుడు శార్దుల్ ఠాకూర్ తుది జట్టులో ఉంటాడు.పేసర్లగా షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్ కు స్థానం దక్కుతుంది. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే శార్దుల్, ఉమేష్ ల్లో ఒకరికే తుది జట్టులో స్థానం ఉంటుంది. ఇలా భారత్ జట్టు కూర్పు ఆసక్తిని రేవుతోంది.


ఇక ఆస్ట్రేలియా జట్టు కూర్పుపై దాదాపు స్పష్టత వచ్చింది. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా , ఫస్ట్ డౌన్ మార్నస్ లబుషేన్, ఆ తర్వాత స్టివ్ స్మిత్, ట్రావిస్ హెడ్ , కామోరూన్ గ్రీన్, కీపర్ అలెక్స్ కేరీ తో బ్యాటింగ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది. కెప్టెన్ కమిన్స్, మిచెల్ స్టార్క్ , స్కాట్ బోలాండ్ తోపాటు గ్రీన్ తో పేస్ అటాక్ చాలా బలంగా ఉంది. స్పిన్నర్ గా నాథన్ లైయన్ ఒక్కడికే ఛాన్స్ దక్కతుంది. అటు బౌలింగ్ , ఇటు బ్యాటింగ్ లో ఆసీస్ సమతూకంగా ఉంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×