BigTV English

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర కుట్ర.. టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్..

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర కుట్ర.. టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్..
amarnath yatra

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర. హిందువులకు అతిపవిత్రమైన యాత్ర. హిమాలయ గుహలో ఏటేటా స్వతహాగా ఆవిర్భవించే హిమ లింగం. 3,880 మీటర్ల ఎత్తున ఏర్పడే.. ఆ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు.. కఠినమైన కొండ మార్గంలో.. లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ యాత్ర చేస్తుంటారు. ఈసారి వార్షిక యాత్ర జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు జరగనుంది.


హిందువుల ఈ అపురూప అమర్‌నాథ్ యాత్రను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు తరుచూ ప్రయత్నిస్తుంటారు. కానీ, మన భద్రతా దళాల అప్రమత్తతతో ముష్కరుల కుట్రలు ఎప్పటికప్పుడు భగ్నం అవుతూనే ఉంటాయి. ఈసారి కూడా అమర్‌నాథ్ యాత్రను టార్గెట్ చేశారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు. నిఘా వర్గాల హెచ్చరికతో.. ఆర్మీ అలర్ట్ అయింది.

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులను.. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఆ దాడులు చేసే పనిని ఇద్దరు కశ్మీర్ యువకులకు అప్పటించినట్టు పక్కా సమాచారం సేకరించింది ఐబీ.


పిర్‌ పంజాల్‌, చీనాబ్‌ వ్యాలీ, రాజౌరీ-పూంఛ్‌ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగొచ్చనే నిఘా వర్గాల హెచ్చరికతో సెక్యూరిటీ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్ర దాడులు చేయొచ్చని భావిస్తున్న ఆ ఇద్దరు కశ్మీరీ యువకుల కోసం కూంబింగ్ చేస్తున్నారు. బోర్డర్‌లో సెక్యూరిటీ టైట్ చేశారు. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయ్యే లోగా.. ఆ ఇద్దరు ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి భద్రతా బలగాలు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×