Jaiswal – Shreyas : ఆసియా కప్ 2025 టోర్నమెంటుకు.. కౌంట్ డౌన్ షురూ అయిన సంగతి తెలిసిందే. మరో 20 రోజుల్లోనే ఈ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. టి20 ఫార్మేట్ లో జరగబోతున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియాను అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ అలాగే… యశస్వి జైష్వాల్ ఇద్దరినీ కూడా పక్కన పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాళ్ళిద్దరూ లేకుండానే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం టీమిండియా జట్టును ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారట భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు.
ఆగస్టు 19వ తేదీన టీమిండియా జట్టు ప్రకటన
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ మరో 20 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఏ ప్లేయర్లను సెలెక్ట్ చేయాలనే దానిపైన భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫోకస్ పెట్టింది. ఈనెల 19వ తేదీన బీసీసీఐ అధికారులు అత్యవసర సమావేశం కాబోతున్నారట. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి… ఆసియా కప్ ఆడే టీమిండియా జట్టును ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జట్టులో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉండబోతున్న సంగతి తెలిసిందే. అయితే వైస్ కెప్టెన్సీ విషయంలో సందిగ్ధత నెలకొంది. శుభమన్ గిల్ కు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ ఇస్తారని అంటున్నారు. లేకపోతే అక్షర్ పటేల్ కు ఆ ఛాన్స్ దక్కనుంది.
యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కు ఎదురు దెబ్బ
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియా తుది జట్టులో శ్రేయస్ అయ్యర్ అలాగే యశస్వి జైస్వాల్ ఉండబోరని తెలుస్తోంది. ఈ ఇద్దరినీ కాదని… వేరే ప్లేయర్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ దాకా తీసుకువెళ్లిన శ్రేయస్ అయ్యర్ కు కచ్చితంగా ఈసారి ఆసియా కప్ లో ఛాన్స్ వస్తుందని అందరూ అంచనా వేశారు. మరి కొంతమంది అయితే అతనికి కెప్టెన్సీ కూడా ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు తుది జట్టులోనే అవకాశం ఇవ్వడం లేదు. అటు రెడ్ బాల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టాలని యశస్వి జైష్వాల్ కు సూచనలు చేసిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. రిషబ్ పంతు కూడా గాయం కారణంగా ఈ టోర్నమెంట్ కు దూరం కాబోతున్నాడు.
సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఆసియా కప్ 2025 టోర్నమెంట్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ సెప్టెంబరు 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 19 మ్యాచులు సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతాయి. సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ కూడా ఉంది.
Also Read: Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే