BigTV English

Asian Games : జైశ్వాల్ దూకుడు.. సెమీస్ కి మెన్ ఇన్ బ్లూ..

Asian Games  :  జైశ్వాల్ దూకుడు..   సెమీస్ కి మెన్ ఇన్ బ్లూ..
Asian Games 2023

Asian Games : ప్రస్తుతం చైనా నిర్వహణలో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ లో భాగంగా ఇండియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ టీం తో తలపడింది.చైనా , హాంగ్ జౌ వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది.మొదటినుంచి ఈ మ్యాచ్ లో నిలకడ ప్రదర్శన కనబరిచిన ఇండియన్ ప్లేయర్స్ తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో నేపాల్ టీం ను క్లీన్ బౌల్డ్ చేశారు.


ఈ మ్యాచ్ కచ్చితంగా క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కుర్ర ప్లేయర్లు అయినప్పటికీ ప్రత్యర్థులతో చెడుగుడు ఆడారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వడమే కాకుండా మంచి భాగస్వామ్యం తో గట్టి స్కోరే సాధించారు. ఇద్దరూ కలిసి మొదటి వికెట్ పడే సమయానికి 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోర్ బోర్డ్ని పరిగెత్తించారు. గైక్వాడ్ మొదటి నుంచి చాలా నిదానంగా ఆచితూచి ఆడుతుంటే…మరోపక్క జైశ్వాల్ ప్రత్యర్థులపై దూకుడుగా దూసుకుపోయాడు.

23 బంతులకు 25 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పై కన్నువేసిన గైక్వాడ్ అనుకోకుండా దీపేంద్ర సింగ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మాత్రం రెండే రెండు పరుగులు చేసి పెవీలియన్ వైపు పరుగులు పెట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ 5 పరుగులకే చేతులెత్తేసాడు. దీంతో మొదట్లో భారత్ మంచి స్కోర్ సాధిస్తుందో .. లేదో…అందరూ టెన్షన్ పడ్డారు. తరువాత క్రేజ్ లోకి దిగిన ప్లేయర్స్ లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జైస్వాల్ ఎంతో కొంత ఆదుకున్నాడు.


తీవ్రమైన ఒత్తిడిలో కూడా పక్కా ప్రణాళికతో తన హిట్టింగ్ పరంపర కొనసాగించాడు. 49 బంతులు ఎదుర్కొని 6 సిక్సులు ,8 ఫోర్లు తో బల్ ను బౌండరీలు దాటించి ..100 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. శివం దూబే ఎదుర్కొన్న 15 బంతులలో 4 సిక్స్ లు 2 ఫోర్లు రాబట్టి 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది.

అయితే భారత్ నిర్ణయించిన స్కోర్ చేదించడం కోసం బరిలోకి దిగిన నేపాల టీం భారీగా ఎదురు దెబ్బతింది. పది పరుగులు చేసిన ఆసిఫ్ షేక్ అవుట్ అవ్వడంతో మొదటి వికెట్ భారత్ ఖాతాలో చేరింది. నేపాల్ బ్యాట్స్ మెన్స్ లో ఒక్కళ్ళు కూడా కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. మొన్న జరిగిన మ్యాచ్ లో ఫాస్టెస్ట్ 50 చేసి అందరి దృష్టిని ఆకర్షించిన దీపేంద్ర సింగ్ సైతం 32 పరుగులకే వెనుతిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయిన నేపాల టీం కేవలం 179 పరుగులు చేయగలిగింది. దీంతో 23 పరుగుల తేడాతో భారత్ నేపాల్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×