India vs England 5th Test Yashasvi Jaiswal Creates History: టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా యశస్వి జైశ్వాల్ కొత్త రికార్డు సృష్టించాడు. ధర్మశాల టెస్టులో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి ఈ మైలురాయికి చేరుకున్నాడు. దీంతో తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు.
ఈ రికార్డు ప్రస్తుతం చటేశ్వర్ పుజారా పేరిట ఉంది. తను 11 టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే డాన్ బ్రాడ్‌మన్ తొలి స్థానంలో ఉన్నాడు. అతడు 7 టెస్టుల్లోనే 1000 పరుగులు పూర్తి చేయడం విశేషం. వినోద్ కాంబ్లీ, మయాంక్ అగర్వాల్ 12 టెస్టులు తీసుకుంటే, సునీల్ గవాస్కర్ 11 టెస్టులు తీసుకున్నాడు.
ఇన్నింగ్స్ పరంగా చూస్తే మాత్రం యశస్వి 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. అయితే మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పూర్తి చేశాడు. 18 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా మూడో స్థానంలో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ 19 ఇన్నింగ్స్ లో చేశాడు. సునీల్ గవాస్కర్ 21 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.
Read More: దినేష్ కార్తీక్.. రిటైర్ అవుతున్నాడా?
అయితే యశస్వీ తొమ్మిదో మ్యాచ్‌లోనే ఈ ఫీట్ సాధించాడు. ఎవర్టన్ వీకెస్, హెర్‌బెర్ట్ సట్‌క్లిఫె, జార్జ్ హెడ్లేలు కూడా తొమ్మిది మ్యాచుల్లో వెయ్యి రన్స్ చేసినవారిలో ఉన్నారు.
అత్యంత చిన్నవయసులోనే టెస్టుల్లో వెయ్యి రన్స్ చేసిన యశస్వీ కన్నా ముందు సచిన్ ఉన్నాడు. తను 19 ఏళ్ల 217 రోజుల్లో వెయ్యి పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 21 ఏళ్ల 27 రోజుల్లో ఈ ఫీట్ సాధించాడు. యశస్వి అయితే 22 ఏళ్ల 70 రోజుల్లో వెయ్యి రన్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. బ్యాటింగ్ యావరేజ్‌లో కూడా యశస్వీ రికార్డులు బ్రేక్ చేశాడు. వినోద్ కాంబ్లీ 83.33 సగటుతో టాప్‌లో నిలిస్తే.. యశస్వీ 71.43 సగటుతో మూడో స్థానంలో నిలిచాడు.