Yashasvi Jaiswal : ఇంగ్లాండ్ తో లండన్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ బౌలర్ అట్కిన్సన్ వేసిన 51 ఓవర్ లో రెండో బంతికి సింగిల్ తీసి శతకం మార్క్ అందుకున్నాడు. 127 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే జైస్వాల్ కి ఇది టెస్టులో 6వ టెస్ట్ సెంచరీ కాగా.. ఇంగ్లాండ్ పై నాలుగో శతకం.. సెంచరీ అనంతరం జైస్వాల్ చేసుకున్న సంబురాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Sai Sudharsan : ఓవల్ టెస్టులో ఉద్రిక్తత వాతావరణం.. సాయి సుదర్శన్, డకెట్ మధ్య ఏం జరిగిందో తెలుసా ?
సెంచరీ రోహిత్ కి అంకితం
ముఖ్యంగా సెంచరీ చేసిన అనంతరం యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. గాల్లోకి ఎగిరి పంచ్ ఇచ్చాడు. ఆపై గ్యాలరీ వైపు చూస్తూ.. ముద్దుల వర్షం కురిపించాడు. అంతేకాదు.. లవ్ సింబల్ కూడా చూపించాడు. గతంలో కూడా జైస్వాల్ ఇలాగే సెలబ్రేషన్ చేసుకున్నాడు. కానీ ఈ సారి లవ్ సింబల్ చూపించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. జైస్వాల్ ఏంటి కథ, జైస్వాల్ ఆ లవ్ సింబల్, ముద్దులు ఎవ్వరికీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ చూడటానికి యశస్వి తల్లిదండ్రులు ఓవల్ మైదానానికి వచ్చారు. వారి కోసమే ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అంతేకాదు.. తన సెంచరీని స్టేడియం కి వచ్చిన రోహిత్ శర్మకు అంకితం ఇచ్చాడు.
ఇంగ్లాండ్ లక్ష్యం 374
ఇక రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 164 బంతుల్లో 118 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ సిరిస్ ఫలితం ఇవాళ తేలిపోయే అవకాశముంది. బౌలర్ల శ్రమకు న్యాయం చేస్తూ బ్యాటర్లూ అదరగొట్టడంతో ఇంగ్లాండ్ కి భారత్ 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. డకెట్ తో కలిసి శుభారంభాన్ని అందించిన క్రాలీ(14)ని చివర్లో సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఆటను భారత్ ముగించింది. అంతకు ముందు అంచనాలను మించి ఆడిన భారత్ 396 పరుగులు చేసి ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్ (118) కెరీర్ లో అత్యంత విలువైనది అనదగ్గ శతకం సాధించాడు. రెండో రోజు నైట్ వాచ్ మన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ (66) అర్థశతకంతో ఇంగ్లీషు బౌలర్లకు షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5/125, అట్కిన్సన్ 3/127, ఓవర్టన్ 2/98 రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఇ:గ్లాండ్ జట్టు 247 పరుగులు చేసి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసి.. 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 50/1 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఇవాళ టీమిండియా వికెట్లను తీస్తుందో.. ఇంగ్లాండ్ జట్టు 374 పరుగులను ఛేదిస్తుందో వేచి చూడాలి మరీ.