OTT Movie : అతీంద్రియ శక్తులు, భయంకరమైన సన్నివేశాలతో ప్రేక్షకులను భయపెట్టడానికి రకరకాల హారర్ సినిమాలు వస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీలతో భయపెట్టడంలో కూడా సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక అతీంద్రియ గేమ్ చుట్టూ తిరుగుతుంది. ఈ గేమ్ ఆడినవాళ్లు దెయ్యం చేతిలో భయంకరంగా చనిపోతుంటారు. హారర్ ప్రియులకు ఈ డెడ్లీ డెత్ గేమ్ సినిమా ఒక మంచి స్టఫ్ లాంటిది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘స్పిన్ ది బాటిల్’ (Spin the Bottle) 2024లో వచ్చిన ఒక అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ సినిమా. దీనికి గావిన్ వీసెన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో టానర్ స్టైన్, కైలీ కనేషిరో, అలీ లార్టర్, జస్టిన్ లాంగ్, టోనీ అమెండోలా, రియాన్ విట్నీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2024 అక్టోబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంది. రెండు గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఉత్కంఠంగా నడుస్తుంది.
స్టోరీలోకి వెళితే
1978లో టెక్సాస్‌లోని జెన్నింగ్స్ అనే చిన్న పట్టణంలో ఒక టీనేజర్ల గ్రూప్, లొరెలై అనే అమ్మాయి ఇంటి బేస్‌మెంట్‌లో స్పిన్ ది బాటిల్ అనే గేమ్ ఆడుతారు. ఆ గేమ్‌లో వీళ్లంతా ఒక పాత బాటిల్‌ను ఉపయోగిస్తారు. అది ఒక శాపగ్రస్తమైన వస్తువు. ఆ గేమ్ ఒక దెయ్యాన్ని బయటకు తెస్తుంది. ఆ దెయ్యం లొరెలై లోపలికి ఆవహిస్తుంది. ఆతరువాత తన స్నేహితులందరినీ చంపేస్తుంది. ఈ సంఘటన ఆ పట్టణంలో సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుత కాలంలో కోల్ తన తల్లి మౌరాతో ఆ ఇంటికి వస్తాడు. కోల్ తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో, మౌరా మానసిక ఆసుపత్రిలో ఉంటుంది. కోల్ ఆ ఇంటిని రిపేర్ చేసి అమ్మాలని ప్లాన్ చేస్తాడు. కోల్ కొత్త పాఠశాలలో చేరి కేసీ, సోఫీ, ట్రావిస్‌లతో స్నేహం చేస్తాడు. వాళ్లు ఒక రాత్రి పార్టీ కోసం కోల్ ఇంటి బేస్‌మెంట్‌లో స్పిన్ ది బాటిల్ ఆడతారు.
Read Also : అందమైన అమ్మాయిని వశపరచుకుని ఆ పాడు పని… నరబలితో ఊహించని ట్విస్ట్… ఒంటరిగా చూశారో అంతే సంగతులు
ఆ గేమ్ ఆడినప్పుడు, వాళ్లు ఆ శాపగ్రస్త బాటిల్‌ను మళ్లీ ఉపయోగిస్తారు. లొరెలై దెయ్యం మళ్లీ బయటకు వస్తుంది. లొరెలై దెయ్యం ఒక్కొక్కరినీ భయంకరంగా చంపడం మొదలవుతుంది. సోఫీ, ట్రావిస్ వంటి వాళ్లు ఒక్కొక్కరూ చనిపోతారు. కోల్, కేసీ కలిసి ఈ దెయ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కోల్‌కు తన తల్లి మౌరాకు ఈ గతంతో సంబంధం ఉందని, లొరెలై తన బామ్మ అని తెలుస్తుంది. ఒక ప్రీస్ట్ ఈ శాపం గురించి వివరిస్తాడు. కోల్, కేసీ లొరెలై దెయ్యాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. కోల్, కేసీ ఆ దెయ్యాన్ని ఎలా ఎదుర్కుంటారు ? ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సూపర్‌నాచురల్ హారర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.