Sai Sudharsan : ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ ఇక చివరి దశకు చేరుకుంది. లండన్ లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం.. వాదొపవాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఆటలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం సర్వసాధారణం. ముఖ్యంగా సాయి సుదర్శన్, బెన్ డకెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత మ్యాచ్ లో మరింత ఉద్రిక్తతను పెంచేసింది. రెండో రోజు ఆట ముగింపులో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాయి సుదర్శన్ అవుట్ అయి పెవిలియన్ వైపు వెళ్తున్నప్పుడు, డకెట్ ఏదో అనడంతో ఈ గొడవ మొదలైంది. ఓవల్ టెస్ట్ రెండో రోజు ఆట చివరి సెషన్‌లో, భారత రెండో ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read : IND Vs ENG 5th Test : టీమిండియా ఓపెనర్ మరో సెంచరీ..ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో రెచ్చిపోవాల్సిందే..!
డకెట్-సుదర్శన్ మధ్య ఉద్రిక్తత
ముఖ్యంగా 18వ ఓవర్‌లో, గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ను ఎల్బీడబ్ల్యూగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. సుదర్శన్ డీఆర్‌ఎస్ తీసుకున్నప్పటికీ, మూడో అంపైర్ కూడా అవుట్ అని నిర్ధారించాడు. దీంతో సాయి సుదర్శన్ నిరాశగా పెవిలియన్ వైపు నడుస్తున్నాడు. అదే సమయంలో, ఫీల్డింగ్ చేస్తున్న బెన్ డకెట్ సాయి సుదర్శన్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడు. ఆ మాటలు విని సుదర్శన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, డకెట్‌కు గట్టిగా బదులిచ్చాడు. ఆ తర్వాతే అతను పెవిలియన్‌కు వెళ్లాడు. వారి మధ్య సంభాషణ ఏమిటనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ సంఘటన మ్యాచ్‌లో ఉద్రిక్తతను మరింత పెంచింది. రెండో రోజు ఆటలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య చాలా వాదనలు జరిగాయి. ఓవల్ టెస్ట్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారతీయ బౌలర్లలో సిరాజ్ 19వవాడు.
టీమిండియా ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 118 పరగులు, ఆకాశ్ దీప్ 66, జడేజా 53, వాషింగ్టన్ సుందర్ 53 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అయితే వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. కేవలం 39 బంతుల్లోనే సుందర్ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 07, సాయి సుదర్శన్ 11, శుబ్ మన్ గిల్ 11 ఈ మ్యాచ్ లో కాస్త నిరాశ పరిచారు. ధ్రువ్ జురెల్ 34 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మరోసారి కరుణ్ 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో మాత్రం హాప్ సెంచరీ చేశాడు కరుణ్ నాయర్. రెండో ఇన్నింగ్స్ సిరాజ్ ఒక్కడే డకౌట్ గా వెనుదిరిగారు. మిగతా బ్యాటర్లు అంతా పరుగులు చేయడం విశేషం.