10th Exams in Telangana: తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్గామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా.. అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 9 వేల 403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారిలో 2 లక్షల 58వేల 895 మంది బాలురు, 2 లక్షల 50 వేల 508 మంది బాలికలు ఉన్నారు. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2వేల 650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షల కోసం 2 వేల 650 మంది ఛీఫ్ సూపరిడెంటెండెంట్లు, 2 వేల 650 డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 28 వేల 100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో ఛీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించారు.
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానుండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.. స్టూడెంట్స్ టెన్షన్ పడకుండా పరీక్షలు బాగా రాయాలని కోరారు. ఆందోళన పడకుండా ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్స్ రాయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాలు ముందే చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని పలు సూచనలు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. పరీక్షలు రాయడానికి వస్తున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 235 పరీక్ష కేంద్రాల్లో 45 వేల 562 మంది విద్యార్థులు పరీక్షలు రాయమన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు.
మరోవైపు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 184 పరీక్ష కేంద్రాలలో 35,020 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరు కానుండగా.. జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, కస్టోడియన్ లతో పాటు మొత్తం 2,432 మంది సిబ్బంది విధులలో పాల్గొననున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ సారి 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌తో పాటు ప్రతి పేజీపై సీరియల్ నంబర్ , క్యుఆర్ కోడ్ ఇచ్చారు.
Also Read: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపుని కేంద్రం ఆమోదిస్తుందా?.. రాష్ట్ర బిజేపీ నాయకులు ఎటువైపు?
ఇంటర్మీడియట్ పరీక్షల నిబంధనలాగానే ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేశారు. ఎక్జామ్స్ సెంటర్స్ వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష కేంద్రాలలో కనీస సౌకర్యాలు తాగు నీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్‌ల సౌకర్యం కలిపించారు అధికారులు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమరాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ లోని కంట్రోల్ రూమ్ లలో ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. విద్యార్థులు ఎలాంటి స్మార్ట్ ఫోన్స్, వాచ్ లు, ఎలక్ట్రానిక్ గార్డెన్స్ తీసుకొని రావద్దని సూచించారు.