America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఈసారి అమెరికన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తాన్నే క్లోజ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖను డిస్మాంటిల్ చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ట్రంప్ మరొక కీలక నిర్ణయం
అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వ్యయం తగ్గింపుపై ఫోకస్ చేశారు అధ్యక్షుడు ట్రంప్. ఇందులో భాగంగా ఇటీవల విద్యాశాఖలో ఉద్యోగాల్లో భారీగా కోతలు వేశారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి నాలుగు వేలకుపైగా అందులో ఉద్యోగులు ఉండేవారు. వారిలో 600 మంది పదవీ విరమణ చేయడానికి ముందుకొచ్చారు.
తాజాగా విద్యాశాఖని మూసి వేశారు. విద్యాశాఖ తొలగింపు అనేది ట్రంప్ ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. యూఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ని రద్దు చేయాలని కన్జర్వేటివ్‌లు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కార్.
గురువారం వైట్‌హౌస్‌లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకం చేశారు. త్వరలో దీన్ని అమలుచేస్తామన్నారు. ఈ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి మేలు జరగలేదని, అధికారాలను తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ALSO READ: భారత్‌కు ట్రంప్ వార్నింగ్.. సుంకాలు త్వరగా తగ్గించాలి లేకుంటే
45 ఏళ్ల తర్వాత ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ని శాశ్వతంగా తొలగించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినట్టు తెలిపారు ట్రంప్. అది కరెక్ట్ అని డెమొక్రాట్లకు తెలుసని, దీనికి ఓటు వేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
విద్యార్థుల ఫీజుల రాయితీలు కొనసాగిస్తామన్నారు. దేశ ప్రజలకు అందుతున్న విద్య సేవల్లో ఎక్కడా అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు ఆ దేశ విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని డెమోక్రట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.. ఆపై విమర్శించారు కూడా. ఆయన తీసుకున్న అత్యంత విధ్వంసకర ఇది ఒకటిగా పేర్కొన్నారు.
1979లో సృష్టించిన విద్యాశాఖను కాంగ్రెస్ ఆమోదం ఖచ్చితంగా ఉండాల్సిందే. రిపబ్లికన్లకు దానిని అమలు చేయడానికి ప్రస్తుత అక్కడ బలం లేదు. అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారం మాత్రమే ఉంది. ఈ విషయం వైట్ హౌస్ కు తెలుసని అంటున్నారు.
యూఎస్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి?
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాన్ని 1979లో జిమ్మీ కార్టర్ సృష్టించారు. ఎప్పటికప్పుడు జాతీయ విద్యా విధానాన్ని పర్యవేక్షిస్తుంది. అమెరికా వ్యాప్తంగా పాఠశాలలకు సమాఖ్య సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. విద్య కోసం ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం కీలకమైంది.
యూఎస్ పాఠశాలల డేటాను సేకరిస్తుంది. విద్యా సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి వివక్షను నిషేధిస్తుంది. ఫెడరల్ విద్యా చట్టాలను అమలు చేయడం, ఎడ్యుకేషన్ చట్టాన్ని అమలు చేయడం వంటివి అమెరికా విద్యాశాఖ కీలకమైన బాధ్యతలు.
ఫెడరల్ స్టూడెంట్ వివిధ కార్యక్రమాల ద్వారా దాదాపు 13 మిలియన్లకు పైగా విద్యార్థులకు బిలియన్ల గ్రాంట్లు, వర్క్, స్టడీ ఫండ్స్, రుణాలను అందించింది. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక విద్య, స్టడీకి సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. 1979 నుంచి ఇప్పటివరకు అధిక స్థాయిలో ఖర్చు చేసింది.
దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ. అప్పటినుంచి ప్రతి విద్యార్థిపై ఖర్చు 245 శాతానికి పైగా పెరిగింది. ఈ స్థాయిలో ఖర్చు చేసినా పెద్దగా ప్రయోజనం లేదు. వైట్ హౌస్ డేటా ప్రకారం.. 13 ఏళ్ల పిల్లల గణితం, రీడింగ్ స్కోర్లు దశాబ్దాల్లో అత్యల్ప స్థాయికి పడిపోయాయి.
నాల్గవ తరగతిలో ప్రతీ 10 మందిలో ఆరుగురు, ఎనిమిదో తరగతిలో మూడొంతుల మందికి గణితంలో సరైన ప్రావీణ్యం లేదని తేల్చింది. ఎనిమిదో తరగతి విద్యార్థులు చదవడంలో ప్రావీణ్యం సాధించలేదు. ఇన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ తక్కువ కాలంలో విద్యాశాఖ బడ్జెట్ 600 శాతం పెరిగిందన్నది ట్రంప్ మాట.