BigTV English
Advertisement

Will Modi Govt Approve Reservation: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపుని కేంద్రం ఆమోదిస్తుందా?.. రాష్ట్ర బిజేపీ నాయకులు ఎటువైపు?

Will Modi Govt Approve Reservation: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపుని కేంద్రం ఆమోదిస్తుందా?.. రాష్ట్ర బిజేపీ నాయకులు ఎటువైపు?

Will Modi Govt Approve BC Quota Reservation| తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు  వైఖరి అస్పష్టంగా ఉంది. ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యున్నతి, సంక్షేమం విషయంలో మొదటి నుంచి సానుకూలంగా వ్యవహరించే కమలదళం.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలా.. లేక వ్యతిరేకించాలా.. ఈ రెండూ కాకుండా మధ్యేమార్గంగా తటస్థంగా ఉండాలా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేకుండానే అసెంబ్లీలో తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.


బీఆర్ఎస్ హయాంలో ముస్లింలను బీసీలుగా అంగీకరించని బిజేపీ

గతంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో భారత రాష్ట్ర సమితి (BRS) అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలను బీసీల జాబితాలో చేర్చడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ నాయకత్వం సైతం తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా స్వయంగా ప్రకటించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ నేతలు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ముస్లింలను బీసీల్లో చేర్చడం ద్వారా బీసీలకు దక్కాల్సిన ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తున్నారని దుయ్యబట్టారు. బీసీలకు జరిగే ఈ అన్యాయాన్ని తాము సహించబోమంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ జాబితాలో ముస్లింలను తొలగించి ప్రతిపాదనలు పంపిస్తే వాటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని బీజేపీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో నాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వైఖరి అవలంబించడంతో నాటి బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి పంపించిన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అటకెక్కింది.


తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల గణన జరిపి, బీసీ కులాల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో ముస్లిం జనాభాలో దాదాపు 80% మందిని బీసీలుగా చూపించడంతో బీజేపీ నేతలు మరోసారి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గతంలో బీఆర్ఎస్, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మైనారిటీల మెప్పు కోసం బీసీలకు అన్యాయం చేస్తున్నాయంటూ బండి సంజయ్ వంటి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కులగణనతో సరిపెట్టకుండా, ఆ గణాంకాలను ఆధారంగా చేసుకుని బీసీ రిజర్వేషన్ల శాతాన్ని 28-29 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సైతం చేసింది. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్ల పెంపు అమలవుతుందని, ఇదొక విప్లవాత్మక నిర్ణయమని ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అగ్రవర్ణాలకు చెందిన నేతలైన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీల కోసం ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే, తాను బీసీని అని చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిజర్వేషన్ల పెంపును పార్లమెంటులో ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: రేవంత్ దెబ్బకు.. బీజేపీకి మైండ్ బ్లాక్

బిజేపీ నాయకుల వాదన
భారతీయ జనతా పార్టీ రాజకీయంగా మాత్రమే కాదు.. విధానపరంగానూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. రిజర్వేషన్ ‘మతం’ ఆధారంగా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని బిజేపీ నాయకుల వాదన. రిజర్వేషన్లు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ అసమానతల ఆధారంగా కల్పించారని, సామాజిక అసమానతలకు ‘కుల వివక్ష’ ఒక కారణమని విశ్లేషిస్తున్నారు. సాంకేతికంగా ‘కులం’ అన్నదే లేని మతంలో కుల ఆధారిత రిజర్వేషన్లు ఎలా ఇస్తారన్నది కమలదళం నేతల ప్రశ్న.

ముస్లింలలో ఆర్థికంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబాటు ఉన్నప్పటికీ.. కుల వివక్ష, సామాజిక అసమానతలు ఉండవని.. అలాంటప్పుడు “కులం” ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదన్నది వారి వాదన. రిజర్వేషన్ల ఫలాలు అందుకోలేని అగ్రవర్ణాల కోసం “ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (EWS)” పేరుతో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలు, రిజర్వేషన్ ఫలాలు అందుకోలేకపోతున్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని తమ ప్రభుత్వమే ఇచ్చిందని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. కానీ మైనారిటీ ఓట్ల మెప్పు కోసం ఆ వర్గాలకు చెందినవారిని బీసీల జాబితాలో చేర్చాయని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కమలదళం నేతల వాదన.

రాష్ట్ర నాయకులపై బీజేపీ అధిష్ఠానం సీరియస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానం విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ అగ్రనాయకత్వం అసహనం వ్యక్తం చేసింది. పార్టీ వైఖరి ఏంటో తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం తగదని కాస్త గట్టిగా క్లాస్ పీకినట్టు తెలిసింది. కొత్తగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన మల్క కొమురయ్య, అంజి రెడ్డిలను గురువారం ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరకు రాష్ట్ర ముఖ్య నేతలు తీసుకెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులును రాష్ట్ర నేతలు కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు రాగా.. “బీసీ రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని మాత్రం అడ్డుకోవాల్సిందే” అని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నేతలు బయటికొచ్చిన తర్వాత మీడియాకు వెల్లడించారు.

అమిత్ షా స్పందన, బండి సంజయ్ వంటి నేతలు ముందు నుంచీ చేస్తున్న ప్రకటనలను బట్టి చూస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదించే ప్రసక్తే లేదని అర్థమవుతోంది. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించాలనే పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని ఎలా ఒప్పించగలరో చూడాలి మరి.

Related News

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

Big Stories

×