Illu Illalu Pillalu Today Episode March 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం ప్రేమ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం ప్రేమతో మాట్లాడడానికి ఇష్టపడదు. కాలుజారి కింద పడిపోయి దెబ్బ తగులుతుంది ప్రేమ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి లోపలికి తీసుకెళ్తుంది. నీ ప్రేమ వాళ్ళ అన్నయ్య నువ్వు మా ఇంట్లో పలికి ఎందుకు వచ్చావు వద్దు అనుకొని వెళ్ళిపోయిన దానివి మళ్లీ ఎందుకు వచ్చావు నీకు ఎంత ధైర్యం ఉంటే వస్తావు అనేసి ప్రేమ అని కొడతాడు రామరాజు మీద ప్రేమ పడుతుంది. మా ఇంటి కోడల్ని కొట్టడానికి నువ్వెవరురా అని రామరాజు అంటాడు ప్రేమను కొట్టబోయి. దెబ్బ రామరాజుకు తగులుతుంది. ధీరజ్ మా నాన్నని కొడతావని ఆవేశంగా కొట్టడానికి వెళ్తాడు వాళ్ళ మామ ధీరజ్ ని ఆపుతాడు.. వాడు నాన్న మీదే చెయ్యసాడు మామ వాడిని ఎలా వదిలేస్తున్నావ్ ఈరోజు వాడు అయిపోవాల్సిందే అని ధీరజ్ ఆవేశంగా ఉంటాడు కానీ వాళ్ళ మామ ఆపడంతో కాస్త తాగుతాడు కానీ.. వాళ్ళ నాన్న అని కొట్టింది గుర్తు చేసుకొని ఆ విశ్వమును కొట్టడానికి బయలుదేరుతాడు. కొడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ చందు ఇద్దరు కలిసి విశ్వంను దారుణంగా కొట్టేస్తారు.. వాళ్ళ మామ ఆపడంతో ఇద్దరు ఆగుతారు. మా నాన్న జోలికొస్తే ఇంకొకసారి కొట్టడం కాదు చంపేస్తామని ధీరజ్ విశ్వం కు వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ విశ్వం బయటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వాళ్ళ నాన్నతో అత్తతో చెప్తాడు. దానికి సీరియస్ అయినా సేన నా కొడుకుని ఇలా కొడతారా ముందు ఆ రామరాజుని నేనే చంపేస్తానని అంటాడు.. అంత ఆవేశం పనికిరాదు రా ఆ రామ్ రాజ్ కి బుద్ధ వచ్చేలా చేయాలి ముందు ఆ చందు గాని ఏదో ఒకటి చేయాలి అని భద్ర ప్లాన్ వేస్తుంది. విశ్వంను పోలీసులకి చెప్పాలని భద్ర చెబుతుంది. నేను చెప్పింది అర్థమైందా రా నువ్వు అలానే వెళ్లి కంప్లైంట్ ఇవ్వు అని అనగానే విశ్వం అలాగే అత్త అని వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత భాగ్యం ఈ పెళ్లిని ఎలాగైనా రామ్ రాజ్ అయితే చేయించాలని అనుకుంటుంది. ఆమె తన భర్త ఇంట్లో రామరాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నా బిజినెస్ ని పక్కన పెట్టేసి మరి ఇక్కడికి వచ్చాను ఈ తొక్కలో మీటింగ్ ఏంటి అని భాగ్యం భర్త అంటాడు. దానికి భాగ్యం ఓయబ్బో మీది పెద్ద అంబానీ బిజినెస్ ఇడ్లీలు చట్నీలే కదా మీరు తెచ్చేది ఎలాగో అవే కూలినే కదా అనేసి ఎద్దేవా చేస్తుంది. ఈరోజు ఈ మీటింగ్ కి కారణం ఆ పెళ్లిని రామరాజును చేయడానికి మనము అడ్డంగా ఇరికించాం కదా రామ్ రాజు ఒప్పుకోక తప్పదు అని భాగ్యం అంటుంది. ఇంటికి రెంటు గంటకు 2000 గంటలోనే తెగొట్టాలి లేదంటే మళ్ళీ 2000 కట్టాలి అని భాగ్యం అంటుంది.
అప్పుడే రామరాజు వేదవతి అక్కడికి వస్తారు. మీరు మంచివారే అన్నయ్యగారు మీ గురించి అందరూ మంచిగానే చెప్తున్నారు ఆడపిల్ల తల్లి కదండి కాస్త ఆ మాత్రం మాకు కూడా భయాలు ఉంటాయి కదా అని భాగ్యం అంటుంది. మీ భయాల్లో తప్పులేదు అమ్మ కానీ మా చిన్న కొడుకు చాలా మంచివాడు ఆ నగలను తెచ్చాడు కానీ చివరికి ఆ నగలను మళ్ళీ వాళ్లకే తిరిగిచ్చేస్తాడు ఒకవేళ నగల కోసమే వాడు పెళ్లి చేసుకుంటే ఆ నగలని వాడి దగ్గరే ఉంచుకోవాలి డబ్బులు తీసుకోవాలి కదా అది ఆలోచించండి అని రామరాజు అంటాడు.
వడల నగలతో పెళ్లి చేసుకోవడానికి పెద్ద కారణమే ఉంది అని వేదవతి కూడా తన చిన్న కొడుకు గురించి గొప్పగా చెప్తుందిల నగలతో పెళ్లి చేసుకోవడానికి పెద్ద కారణమే ఉంది అని వేదవతి కూడా తన చిన్న కొడుకు గురించి గొప్పగా చెప్తుంది. మా గురించి ఈ ఊర్లో అందరిని కనుక్కోండి మేము ఎలాంటి వాళ్ళము నీకే తెలుస్తుంది. నా చేతులతో ఎంతోమందికి సాయం చేశాను మీరు కావాలంటే ఊర్లో అందరిని అడిగి తెలుసుకోండి అని రామరాజు అంటాడు. ఆ తర్వాత మీకు అంత నమ్మకం లేకపోతే పర్లేదులేని చెల్లమ్మ అని రామరాజు వెళ్ళిపోతూ ఉంటాడు. భాగ్యం మీ మీద నమ్మకం లేక కదా అన్నయ్యగారు మా భయ్యా మాకు ఉంటాయి కదా ఈ పెళ్లి మీరు అనుకున్నట్టుగానే జరిపిద్దాం. మీరే మా ఇంటికి వచ్చి ఇంతగా బ్రతిమలాడుతుంటే నేను ఎందుకు కాదంట అని చెప్పండి అని అంటుంది.
అనుకున్న ముహూర్తానికి ఎంగేజ్మెంట్ జరిపిద్దాం ఆ తర్వాత పెళ్లి జరిపించేద్దామని భాగ్యం రామరాజు ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. రామరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందండీ పెళ్లి కుదిరింది కదా మనమందరం సంతోషంగా వాడి పెళ్లి చేద్దామని అంటుంది.. ఒక గంట క్రితం నా గుండె ఎంతగా కొట్టుకునేదో ఇప్పుడు వాడి పెళ్లి అయితే అందరం సంతోషంగా ఉంటామని అంటాడు రామ్ రాజు. మన ఇంట్లో అందరితో ఇద్దరూ సంతోషంగా లేరండి ధీరజు ప్రేమని మనము దగ్గరికి రానివ్వట్లేదు వాళ్ళింట్లో అన్నం కూడా తినట్లేదు మీరు వాళ్ళిద్దరిని క్షమించి దగ్గరకు తీసుకోండి అని అంటుంది.
ఇక రామరాజు మరిది అక్కడికొచ్చి బావ పెద్దోడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తాడు ఆ మాట వినగానే షాక్ అవుతాడు రామరాజు వేదవతి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..