E-Paper
Advertisement

DMHO Jobs: ఆ జిల్లాలో టెన్త్ క్లాస్‌తో ఉద్యోగాలు.. జీతం 36,000.. మరో రెండు రోజులే గడువు

DMHO Jobs: ఆ జిల్లాలో టెన్త్ క్లాస్‌తో ఉద్యోగాలు.. జీతం 36,000.. మరో రెండు రోజులే గడువు

DMHO Jobs: ఏపీ, అనంతపురం జిల్లా నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. పదోతరగతి, డిగ్రీ, డి.ఫార్మసి, బి.ఫార్మసి, ఎం.ఫిల్(సోషల్ సైకాలజీ, మెంటల్‌ హెల్త్‌), ఎంఏ సైకాలజీ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. డిస్ట్రిక్ట్  మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్ఓ – అనంతపురం) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌, డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌(DMHO-Ananthapuram) అనంతపురంలో కాంట్రాక్ట్ విధానంలో క్లీనికల్ సైకాలజిస్ట్, ఆడియోలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 10న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 16 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌, డిస్ట్రిక్‌ మెడికల్ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌(DMHO-Ananthapuram)  పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. క్లీనికల్ సైకాలజిస్ట్, ఆడియోలజిస్ట్, ఫార్మసీ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు

క్లినికల్ సైకాలజిస్ట్‌: 01
ఆడియోలజిస్ట్‌/స్పీచ్‌ థెరపిస్ట్‌: 01
ఆప్టొమెట్రిస్ట్‌: 01
ఫార్మసీ ఆఫీసర్‌: 01
డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 04 పోస్టులు
లాస్ట్ గ్రేడ్ సర్వీస్‌(గ్రేడ్‌-4): 08 పోస్టులు

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 10

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, డిగ్రీ, డీ.ఫార్మసీ, బీ.ఫార్మసీ, ఎం.ఫిల్ (సోషల్ సైకాలజీ, మెంటల్‌ హెల్త్‌), ఎంఏ సైకాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు: 2025 జనవరి 1 నాటికి 42 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300  ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు క్లినికల్ సైకాలజిస్ట్‌కు రూ.33,075, ఆడియోలజిస్ట్/స్పీచ్‌ థెరపిస్ట్‌కు రూ.36,465, ఆప్టోమెట్రిస్ట్‌కు రూ.29,549, ఫార్మసీ ఆఫీసర్‌కు రూ.23,393, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,450, గార్డెనర్‌కు రూ.15,000 వేతనం ఉంటుంది.

చిరునామా:  ఆఫీస్‌ ఆఫ్‌ ది డిస్ట్రిక్‌ మెడికల్ హెల్త్‌ ఆఫీసర్‌, అనంతపురం చిరునామాకి అప్లికేషన్ పంపాలి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://ananthapuramu.ap.gov.in/

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. సొంత జిల్లాలో ఉద్యోగం సాధించవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 16

దరఖాస్తుకు చివరి తేది: 2025  ఏప్రిల్ 10

ALSO READ: DIBT Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్, జీతమైతే అక్షరాల రూ.37,000.. పూర్తి వివరాలివే..

ALSO READ: CPCB Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,00,000 పైగా వేతనం.. ఇంకెందుకు ఆలస్యం..!

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×