UP Man on Railway Track: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొంత మంది యువకులు చేస్తున్న స్టంట్లు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్లలో రకరకాల డేంజర్ స్టంట్లు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినా, ఇప్పటికీ మార్పు రావడం లేదు. ఎవరో ఒకరు, ఒక్కడో ఒకచోట ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూనే ఉన్నారు. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. తాజాగా యూపీలోనూ ఓ యువకుడు ఇలాంటి స్టంట్ చేసి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.
ట్రాక్ మీద పడుకుని మీదుగా వెళ్తున్న ట్రైన్ ను షూట్ చేస్తూ..
యూపీలోని ఉన్నావ్ కు చెందిన ఓ యువకుడు రీల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టాడు. రైల్వే ట్రాక్ మీద పడుకుని.. మీదుగా వెళ్తున్న రైలును షూట్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో కాసేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో రైల్వే పోలీసులు దృష్టికి వెళ్లడంతో అతడి గురించి ఆరా తీశారు. ఈ డేంజరస్ స్టంట్ చేసిన యువకుడిని హసన్ గంజ్ లోని న్యోతాని గ్రామానికి చెందిన రంజీత్ చౌరాసియాగా గుర్తించారు. రైల్వే కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడంతో పాటు ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించడం లాంటి ఆరోపణలపై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ వైరల్ క్లిప్ ను ఉన్నావ్ లోని కుసుంభి రైల్వే స్టేషన్ సమీపంలో షూట్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ వీడియోను రంజీత్ ఇన్ స్టాగ్రామ్ నుండి డిలీట్ చేసినప్పటికీ, ఇప్పటికే పలు ప్లాట్ ఫామ్ లలో వైరల్ అవుతూనే ఉంది.
इस रीलपुत्र का नाम रंजीत चौरसिया है। पटरी पर लेटा, अपने ऊपर से पूरी ट्रेन गुजार दी। बाकायदा इसकी रील बनाई। अब रीलपुत्र गिरफ्तार है और जेल जा रहा है।
📍जिला उन्नाव, उत्तर प्रदेश pic.twitter.com/7IrQ42MDsM— Sachin Gupta (@SachinGuptaUP) April 7, 2025
Read Also: ఈ రైళ్లు సికింద్రబాద్‌లో ఆగవు.. ఇకపై చర్లపల్లి, కాచిగూడ నుంచే రాకపోకలు!
జైల్లో ఊచలు లెక్కిస్తున్న యువకుడు
ఈ ఘటనపై ఉన్నావ్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. “ఈ వీడియోను మేం తొలుత సోషల్ మీడియాలో చూశాం. వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. ఆ వ్యక్తిని ఎవరు అనే విషయంపై ఆరా తీశాం. అతడిని గుర్తించాం. అదుపులోకి తీసుకున్నాం. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జైలుకు తరలించాం. రైల్వే ట్రాక్స్, రైల్వే స్టేషన్లలో ప్రమాదకర రీతిలో ఎవరూ ఫోటోలు, వీడియోలు షూట్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా రీల్స్ కోసం డేంజరస్ స్టంట్లు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఒక్కసారి రైల్వే చట్టాల ప్రకారం కేసులు నమోదు అయితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువకుల జీవితాలు ఆగం అవుతాయి. అందుకే, ప్రాణాలను, జీవితాలను పణంగా పెట్టి ఇలాంటి పనులు చేయకూడదని సూచిస్తున్నాను” అని ఉన్నావ్ ఇన్ స్పెక్టర్ అరవింద్ పాండే వెల్లడించారు.
Read Also: పంబన్ బ్రిడ్జిపై వెళ్లే రైళ్లు ఇవే.. మన స్టేట్ నుంచి బయల్దేరే రైలు ఇదే!