E-Paper
Advertisement

People Died due to Rain: ఏ ఏ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా పడింది..? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..??

People Died due to Rain: ఏ ఏ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా పడింది..? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..??
Advertisement

People died due to Heavy Rain fall: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి భారీగా వచ్చి చేరుతుంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రాయులయ్యారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు, వరదల కారణంగా పలువురు మృత్యువాతపడ్డారు.

Also Read: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్

Advertisement

రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 16 మంది మృతిచెందారు. వర్షాలు, వరదల కారణంగా వారు మృతిచెందడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.

Also Read: ఖమ్మంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దు. అధికారులంతా క్షేత్రస్థాయిలో నిరంతరం అలర్ట్ గా ఉండి.. పరిస్థితులను సమీక్షిస్తూ ఉండాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్, రహదారులను వెంటనే పునరుద్ధరించాలి. రాష్ట్రా స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తాం. పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేతలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అంటూ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×