BigTV English

20 CR Dog: మియాపూర్ లో రూ.20 కోట్ల శునకం సందడి.. ఎందుకంత స్పెషల్?

20 CR Dog: మియాపూర్ లో రూ.20 కోట్ల శునకం సందడి.. ఎందుకంత స్పెషల్?

20 CR Dog: మామూలుగా అయితే పెంపుడు కుక్కలను ఎంత పెట్టి కొంటాం.. వందల్లో, లేకపోతే వేలల్లో, మరీ అయితే లక్షల్లో పెట్టి కొంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న డాగ్‌ మామూలుది కాదు. అసలు అలాంటి డాగ్ ను చూసి ఉండకపోవచ్చు. దాని రేటును కూడా అసలు ఊహించనే లేరు. ఎందుకంటే అంత ఎక్కువ. ఒక్క సారి ఆ ధరను చూస్తే కళ్లు తిరిగి కిందపడినంత పని అయిపోతుంది. దాని ధర అక్షరాలా 20కోట్ల రూపాయలు. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఎందుకంటే దాని రేటు అంతేమరి. ఈ అరుదైన జాతి కుక్కను కొన్నాడు బెంగళూరుకు చెందిన యజమాని సతీశ్.


ప్రపంచంలో అత్యంత ఖరీదైన, అరుదైన జాతి కుక్క కాకేసియాన్ షెపర్డ్ డాగ్ హైదరాబాద్ మియాపూర్‌లో సందడి చేసింది. 20 కోట్ల విలువ చేసే ఈ కుక్కతో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. బెంగుళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నటుడు సతీశ్‌ ఈ డాగ్‌ను నగరానికి తీసుకొచ్చారు. మియాపూర్ మదీనాగూడలోని విశ్వాస్ పెట్ క్లినిక్‌కు ఈ డాగ్‌ను పట్టుకొచ్చారు.

ఈ బ్రీడ్ రష్యాకు చెందిందని తెలిపారు సతీశ్‌. 20 కోట్ల రూపాయలు పెట్టి కోనుగోలు చేసినట్లు తెలిపారు. మూడు సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్‌ రోజుకు మూడు కేజీల చికెన్‌ను ఆహారంగా తీసుకుంటుదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రదర్శనలతో పాటు సినిమాలలో కూడా నటించినట్లు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భారీ ఫంక్షన్‌లకు వీఐపీగా పాలుపంచుకున్నట్లు సతీశ్‌ వివరించారు. ఆయన గతంలోనూ పలు జాతుల కుక్కలను కోట్లుపెట్టి కొనుగోలు చేశారు. రూ.10 కోట్ల విలువైన టిబెటన్ మస్తిఫ్, రూ.8 కోట్ల విలువైన అలస్కన్ మాలామ్యూట్, కోటి రూపాయల విలువైన కొరియన్ డోసా మస్తిఫ్ జాతుల కుక్కలు సతీశ్ దగ్గరున్నాయి. వాటన్నింటినీ తాను మహారాజుల్లా చూసుకుంటానని ఆయన పేర్కొన్నారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×