Road Incident In Warangal: వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఇనుప రాడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో పై స్థంభాలు పడి ఏడుగురు మృతి చెందారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద ఇనుప స్థంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పు.. పక్కనే ఉన్న కారు, రెండు ఆటోలపై పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు.. బాలుడు ఉన్నట్లు సమాచారం. ఓ ఆటో డ్రైవర్ కాలు విరిగి విలవిలలాడిపోతున్నాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
వరంగల్ జిల్లా మామునూరు వద్ద భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం
ఆటోను ఢీ కొట్టిన రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ
ప్రమాదంలో నలుగురు మృతి, మరో 6 గురికి తీవ్ర గాయాలు pic.twitter.com/4RDK0mTtKP
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2025