Pakistan Blasphemy Death Sentence | పాకిస్థాన్‌లో మత విశ్వాసాలను అవమానిస్తే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఈ తరహా చర్యలు చేపట్టినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కఠిన శిక్షలు ఎదురవుతాయి. తాజాగా, మహ్మద్ ప్రవక్తను, ఆయన భార్యలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నలుగురికి మరణశిక్ష విధిస్తూ లాహోర్ కోర్టు తీర్పు వెల్లడించింది.
నేరారోపణలు, తీర్పు వివరాలు
మత విశ్వాసాలను అవమానిస్తూ నిందితులు నాలుగు వేర్వేరు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పోస్టులు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు తీవ్ర నేరారోపణలతో కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు నలుగురికి మరణశిక్ష విధించింది. అంతేకాదు, మరికొందరికి 80 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.52 లక్షల జరిమానా విధించింది.
పాకిస్థాన్‌లో మత చట్టాలు
పాకిస్థాన్‌లో మత విశ్వాసాలను అవమానించడం పై కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. అయితే, ఇస్లామేతర మైనార్టీలపై ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు సర్వత్ర వినిపిస్తూనే ఉన్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఈ అంశంపై ఇంతకు ముందే ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: ఆ దేశంలో ఊసరవెల్లుల బెడద.. లక్షకు పైగా జీవులను చంపేయాలని ప్రభుత్వ నిర్ణయం
ఇంతకుముందు పాకిస్తాన్ లో 2018లో ఒకసారి 2024లో ఒకసారి ఇద్దరు మహిళలను దైవదూషణ ఆరోపణలు కోర్టులు కఠినంగా శిక్షించాయి. 2024లో షౌగతా కరన్ అనే క్రైస్తవ మహిళను ఇస్లామాబాద్ స్పెషల్ కోర్టు పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 295 సి ప్రకారం దోషిగా తేలుస్తూ మరణ శిక్ష విధించింది. ఆమె 2020 సంవత్సరంలో ప్రవక్త మహమ్మద్ ను అవమానిస్తూ వాట్సాప్ లో కంటెంట్ షేర్ చేసిందని నిరూపితమైంది. దీంతో పాటు ఆమెకు రూ.3 లక్షలు జరిమానా, 7 ఏళ్లు జైలు శిక్ష కూడా విధించారు.
అయితే 2016లో కూడా దైవదూషణకు పాల్పడిందని ఆసియా బీబి అనే మహిళకు పాకిస్తాన్ కోర్టు 8 ఏళ్లు కళి విధించింది. కానీ రెండేళ్ల తరువాత సుప్రీం కోర్టు ఆమెకు నిర్దోషిగా విడుదల చేసిన వెంటనే ఆమె కెనడా వలస వెళ్లిపోయింది.
ఇరాన్‌లో పాప్ సింగర్ టాట్లూకు మరణశిక్ష
ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న ఇరాన్ పాప్ సింగర్ అమీర్ హుస్సేన్ (టాట్లు)కు కూడా కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. మహ్మద్ ప్రవక్తను దూషించడమే కాకుండా, దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఈ శిక్ష విధించబడింది.
టాట్లూ కేసు వివరాలు
టాట్లూ 2018 నుంచి టర్కీలో నివసిస్తుండగా, 2023 డిసెంబరులో టర్కిష్ పోలీసులు అతడిని ఇరాన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి అతను నిర్బంధంలోనే ఉన్నాడు. దేశద్రోహానికి సంబంధించి కోర్టుకు అందించిన ఆధారాలు పరీశిలించన తరువాత అతడికి మరణశిక్షను ఖరారు చేశారు.
టాట్లూకు వ్యభిచారానికి మద్దతుగా ప్రచారం చేయడం, అసభ్యకరమైన కంటెంట్ పబ్లిష్ చేయడం, ఇస్లాం వ్యతిరేక ప్రచారం చేయడంపై 10 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. అయితే, తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం కోర్టు అతడికి కల్పించింది.