Hyderabad News: హైదరాబాద్, హయత్ నగర్‌లో దారుణం ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పసి పాప చనిపోయింది. చిన్నారి తల్లి కళ్ల ముందే డ్రైవర్ రూపంలో మృత్యువు వెంటాడింది. బస్సును రివర్స్ చేస్తుండగా.. డ్రైవర్ వెనుకాల ఉన్న పాపను గమనించలేదు. దీంతో బస్సు టైర్ల కిందపడి చిన్నారి మృతిచెందింది.
వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల పసి పాప స్కూల్ బస్సు కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. హయత్ నగర్ లో రోజు లాగే పిల్లలు స్కూల్ కు వెళ్లారు. సాయంత్రం స్కూల్ సమయం అయిపోవడంతో పిల్లలందరూ ఇంటికి వెళ్లేందుకు బస్సు దగ్గరకు వచ్చారు. స్కూల్ పిల్లలందరూ బస్సు ఎక్కారు. అయితే ఓ చోట నాలుగేళ్ల చిన్నారి బస్సు నుంచి దిగి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. చిన్నారి రోడ్డుప నడవడాన్ని డ్రైవర్ గుర్తించలేదు. బస్సును రివర్స్ చేసే ప్రయత్నంలో వెనుకాల టైర్ల కింద పడి చిన్నారి చనిపోయింది. ఈ ఘటనలో చిన్నారి కుటుంబంలో, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: CBI Recruitment: గోల్డెన్ ఛాన్స్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 ఉద్యోగాలు..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది..? అని ఆరా తీశారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.