Indian Railways Toilets: ప్రపంచ వ్యాప్తంగా భారతీయ రైల్వే సంస్థ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 170 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే.. అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి ఉన్న దేశాల్లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. దేశ వ్యాప్తంగా రోజూ 20 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి. వాటిలో 13 వేలకు పైగా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. మిగతావి గూడ్స్ రైళ్లు. తక్కువ ధరలో ఆహ్లాదక ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది ట్రైన్ జర్నీ చేసేందుకు మొగ్గు చూపుతారు. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, దేశంలో రైళ్లు ప్రారంభం అయిన చాలా ఏండ్ల పాటు రైళ్లలో టాయిలెట్స్ ఉండేవి కాదు. కానీ, 1909లో జరిగిన ఓ ఇన్సిడెంట్ రైళ్లలో టాయిలెట్స్ పెట్టేందుకు కారణం అయ్యింది. ఇంతకీ అందేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1909లో ప్రభుత్వానికి లేఖ రాసిన ప్రయాణీకుడు
సుదూర రైలు ప్రయాణం చేసే వారికి టాయిలెట్స్ అనేవి తప్పని సరిగా ఉండాలి. రైలు ప్రయాణంలో టాయిలెట్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకప్పుడు రైళ్లలో టాయిలెట్స్ ఉండేవి కాదు. కానీ, 1909లో ఒకీల్ చంద్రసేన్ అనే వ్యక్తి రైళ్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో తనకు టాయిలెట్ వచ్చింది. అర్జంట్ గా వెళ్లాలి అనుకున్నాడు. ఇంతలోనే సాహిబ్జంగ్ అనే రైల్వే స్టేషన్ స్టేషన్ వచ్చింది. రైలు ఆగింది. వెంటనే ఆయన రైలు దిగి బాత్ రూమ్ కు వెళ్లాడు. అదే సమయంలో రైలు కదిలింది. వెంటనే చంద్రసేన్ తన పంచను చేతిలో పట్టుకుని పరిగెత్తాడు. అతడిని చూసి రైళ్లో ఉన్న వాళ్లంతా నవ్వారు. ఆయన చాలా బాధపడ్డాడు.
తొలి రోజుల్లో టాయిలెట్ ఎలా ఉండేదంటే?
ఇంటికి వెళ్లిన చంద్రసేన్.. ఇదే విషయాన్ని చెప్తూ రైల్వే అధికారులకు లేఖ రాశాడు. రైల్లో టాయిలెట్ లేకపోవడం వల్ల తాను ఇబ్బంది పడటంతో పాటు అవమానానికి గురైనట్లు చెప్పారు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదంటే రైళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు ఆయన లేఖను చూసి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. రైళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓ సాధారణ ప్రయాణీకుడికి కలిగిన ఇబ్బంది కారణంగా ఈ రోజు రైళ్లలో టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. తొలినాళ్లలో సాధారణగా చిన్న గది, ఓ డ్రమ్ములో నీళ్లు ఏర్పాటు చేసేవాళ్లు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చేశారు. నెమ్మదిగా నీటి సరఫరాను తీసుకొచ్చింది. ప్రస్తుతం అత్యాధునిక టాయిలెట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. బయో టాయిలెట్లు, ఆటోమేటిక్ ఫ్లషింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
చంద్రసేన్ లేఖను భద్రపరిచిన రైల్వేశాఖ
రైళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని చంద్రసేన్ రాసిన లేఖను ఇప్పటికీ భద్రంగా ఉంది. న్యూఢిల్లీలోని రైల్వే మ్యూజియంలోప ప్రదర్శనకు ఉంచారు. మొత్తంగా చంద్రసేన్ రాసిన లేఖ ప్రస్తుతం ప్రయాణీకులను ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసేలా ఉపయోగపడింది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు, ఎన్ని కిలో మీటర్లు ఉంటుందో తెలుసా?