Shaikpet Fire Incident: హైదరాబాద్‌లోని షేక్‌పేట్ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఐదున్నర గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. షేక్‌పేట్‌లోని రిలయన్స్ ట్రెండ్స్ షాపు ఉన్న బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. అదే బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్‌లోవున్న ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో తొలుత మంటలు చెలరేగాయి.
అక్కడి నుంచి పైఅంతస్తులకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో ముగ్గురు వ్యక్తులున్నారు. వారిని సురక్షితంగా కాపాడారు ఫైర్ సిబ్బంది.
ఈ ఘటనపై జిల్లా ఫైర్ ఆఫీసర్ స్పందించారు. సెకండ్ ఫ్లోర్‌లో అధికంగా ఫర్నిచర్ ఉండడంతో పైఅంతస్థుల వరకు మంటలు వ్యాపించాయన్నారు. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అనేదానిపై తనిఖీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది? అనేదానిపై విచారణ మొదలైంది. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేమైనా జరిగిందా? అనేదానిపై లోతుగా విచారణ మొదలుపెట్టారు అధికారులు.
ALSO READ: సింగపూర్‌లో సీఎం రేవంత్ టీమ్
షేక్ పేట్ రిలయన్స్ ట్రెండ్స్ అగ్ని ప్రమాదం అప్డేట్స్..
ఉదయం 5.20 గంటలకు ఘటన
బిల్డింగ్ లోని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఆకాష్ ఇన్స్ టిట్యూట్ లో ముందుగా చెలరేగిన మంటలు
అనంతరం పై అంతస్తులకు వ్యాపించిన మంటలుఅగ్ని ప్రమాద సమయంలో బిల్డింగ్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా కాపాడిన… https://t.co/7y3TVIxKY8 pic.twitter.com/7rel8hDe4H
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2025