CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. గురువారం రాత్రి సింగపూర్‌కు చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.
తొలుత సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల నుంచి ఇరువురు చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య- నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కులు మొదలైన వాటిపై చర్చించారు. చాంగిలో సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మరో టీమ్ సందర్శిస్తోంది.
ఈ నేపథ్యంలో సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్-(ఐటీఈ)ని రేవంత్ టీమ్ సందర్శించనుంది. సింగపూర్ నైపుణ్యం అభివృద్ధికి ఐటీఈ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేలా ఐటీవోతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
సింగపూర్‌లో రివర్ ఫ్రంట్‌ను సందర్శించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో అక్కడ జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోనున్నారు. 18న సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో స్థానిక తెలుగు వారిని ముఖ్యమంత్రి బృందం కలవనుంది.
ALSO READ: ఫార్ములా ఈ రేసు కేసు.. ఆరున్నర గంటలపాటు విచారణ, కేటీఆర్‌కు 52 ప్రశ్నలు వాటి చుట్టూనే
సింగపూర్ పర్యటన అనంతరం రేవంత్ టీమ్ 20న దావోస్‌కు చేరుకుంటుంది. 20 నుంచి 22 తేదీ వరకు ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు 2025’లో పాల్గొంటుంది. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది.
గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈ సారి అంతకు మించిన పెట్టుబడుల లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్షలో వెల్లడించారు. ఇప్పటికే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది.
అమెజాన్ సహా ఇతర పేరు పొందిన కంపెనీలు తమ గ్లోబల్ సెంటర్లకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎన్నుకున్నాయి. ఐటీ, ఏఐ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలతో పాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ) పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, వరల్డ్ క్లాస్ సిటీగా గ్రేటర్ సిటీలో ఎలివేటేడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే.
We began our two-nations tour in #Singapore with a very engaging, fruitful and wide-ranging discussions with the amazingly insightful Indophile, Dr Vivian Balakrishnan, Foreign Affairs Minister, Government of Singapore.
We converged on forging a broad, long-term partnerships… pic.twitter.com/P0BhorsEkW
— Revanth Reddy (@revanth_anumula) January 17, 2025