BigTV English
Advertisement

Marriage: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దరి మెడలో ఒకేవేదికపై తాళికట్టిన యువకుడు

Marriage: మూడేళ్లుగా సహజీవనం.. ఇద్దరి మెడలో ఒకేవేదికపై తాళికట్టిన యువకుడు

Marriage: పెళ్లి చేసుకోవడం.. కొన్ని రోజులు కాపురం చేశాక మనస్పర్థాలు రావడంతో విడిపోవడం.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇద్దరు అమ్మాయిలను ఒకే సారి పెళ్లి చేసుకున్నాడు. ఒకే మండపంపై ఒకే ముహూర్తానికి ఇద్దరి మెడలో తాళి కట్టాడు.


భద్రాద్రి జిల్లా ఎర్రబోరు గ్రామంలో జరిగింది ఈ ఘటన. సత్తిబాబు అనే వ్యక్తి స్వప్న, సునీతలతో ఒకరికి తెలియకుండా ఒకరితో మూడేళ్లుగా సహజీవనం చేశాడు. ఇప్పటికే సునీతకు ఓ బాబు ఉండగా.. ఇటీవల స్వప్నకు ఓపాప జన్మించింది. దీంతో ఈ విషయం బయటపడింది. ఈక్రమంలో ఇద్దరూ తమను పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును వేధించారు.

దీంతో చేసేది ఏమీ లేక ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సత్తిబాబు. ఈ విషయాన్ని పెద్దలకు కూడా చెప్పడంతో వారు అందుకు అంగీకరించారు. ఇటీవల వారి పెళ్లిని వైభవంగా జరిపించారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×