Big Stories

Rakesh Reddy: చిగురుపాటి జయరాం హత్య కేసు.. రాకేశ్‌రెడ్డికి జీవిత ఖైదు

Rakesh Reddy: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో A1గా ఉన్న రాకేశ్ రెడ్డిని ఇటీవల దోషిగా తేల్చిన కోర్టు.. తాజాగా అతనికి జీవితఖైదు విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.

- Advertisement -

ఈ కేసుకు సంబంధించి ఇటీవల 23 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. హనీట్రాప్‌తో రాకేశ్‌రెడ్డి కుట్రపన్ని.. జయరాంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలను ఛార్జిషీట్‌తో జతపరిచారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఈ కేసులో 11 మందిని నిర్దోషులుగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది.

- Advertisement -

2019 జనవరి 31న జయరాం హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యను రాకేశ్‌ తన స్నేహితులతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు. డబ్బుల వ్యవహారంలోనే రాకేశ్‌ హత్యకు పాల్పడ్డారని 2019 మేలో పోలీసులు నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసుపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ కొనసాగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News