BigTV English

Jogulamba Gadwal: ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకి జన్మనిచ్చిన తల్లి

Jogulamba Gadwal: ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకి జన్మనిచ్చిన తల్లి

A Mother Gave Birth To A Pregnant Child In An RTC Bus: ఓ నిండు గర్భిణీ దవాఖానకు ఆర్టీసీ బస్సులో వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆవిడకు పురిటినొప్పులు రావడం స్టార్ట్ అయింది. దీంతో చేసేదేమి లేక ఆర్టీసీ బస్‌ని పక్కకు నిలిపివేసింది డ్యూటీలో ఉన్న లేడీ కండక్టర్. దగ్గరలో నర్స్‌ ఉందని తెలుసుకొని ఆమె సాయంతో డెలివరి చేయగా ఆ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. గద్వాల నుండి వనపర్తికి వెళ్లే 2543 నెంబర్ గల పల్లెవెలుగు బస్సులో కండక్టర్ జి. భారతి డ్యూటీలో ఉంది. వనపర్తికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసినల్లి గ్రామం వద్ద నిండు గర్భిణి సంధ్యకు గద్వాల మండలంలో ఒక్కసారిగా పురిటి నొప్పులు రాగా.. కండక్టర్ వెంటనే ఈ విషయాన్ని డిపో మేనేజర్‌కి తెలిపింది.


డిపో మేనేజర్ సూచనల మేరకు బస్సు ఆపి బస్సులో ఎవరైనా ట్రీట్మెంట్ తెలిసిన వారు ఉన్నారా అని కనుక్కొని.. ఒక సిస్టర్ ఉందని తెలుసుకొని ఆమె సహాయంతో మగవారిని బస్సు నుండి దించేసి బస్సులోనే ఆ గర్భిణికి డెలివరీ చేసింది. ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.దీంతో అందులోని కండక్టర్, డ్రైవర్ ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే కండక్టర్ 108 అంబులెన్స్ వాహనానికి ఫోన్ చేయగా అంబులెన్స్ సిబ్బంది వచ్చి వారిని వనపర్తి హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు.

Also Read: నకిలీ విలేకరిపై కేసు ఫైల్‌, రిమాండ్


దీంతో కండక్టర్, డ్రైవర్ చేసిన పనికి ఆ ఊరు ప్రజలంతా ఆర్టీసీ సిబ్బందిని కండక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇక డెలీవరి అయిన మహిళ ఆ కండక్టర్ రుణం తీర్చుకోలేదని తనకి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఏరియా దవాఖానలో క్షేమంగా ఉన్నారు. తన భర్త పేరు రామంజి కొండపల్లిగా తెలిపింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆనందంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన న్యూస్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ కండక్టర్ టైమింగ్‌ని చూసి తారీఫ్ చేస్తున్నారు.

Related News

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్

Kavitha Vs Harish: తెలంగాణ లీక్స్.. కవితక్క అప్ డేట్స్

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారందరికి త్వరలో స్మార్ట్ కార్డులు

Harisha Rao Met KCR: కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ.. కవితకు కౌంటర్ ఇస్తారా ? కామ్ గా ఉంటారా ?

Ganesh Nimajjanam: ఖైరతాబాద్ వినాయకుడికి ఘన వీడ్కోలు.. ముగిసిన నిమజ్జనం

Balapur Laddu: బాలాపూర్ ల‌డ్డూకు రికార్డ్ ధ‌ర‌.. ఎవరు దక్కించుకున్నారంటే..?

Big Stories

×