BigTV English

Hair Fall Tips: జుట్టు ఎక్కువగా రాలి బట్టతల వస్తుందా? ఈ జాగ్రత్తలు పాటించండి!

Hair Fall Tips: జుట్టు ఎక్కువగా రాలి బట్టతల వస్తుందా? ఈ జాగ్రత్తలు పాటించండి!

follow this health tips to help prevent hair loss and baldness: నేటి తరుణంలో జుట్టురాలే సమస్య చాలామందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్నవయసులోనే ఇలాంటి సమస్యతో ఇబ్బంధి పడుతున్నారు. ఇంతకు ముందు బట్టతల అంటే ఏ 50- 60 ఏళ్ల వయసు వారికి చూసేవాళ్లం. కానీ రోజుల్లో మాత్రం చాలా చిన్న వయసులోనే బట్టతల రావడం అనేది సర్వసాధారణంగా మారింది. మరి బట్టతల రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. అసలు బట్టతల ఎందుకు వస్తుంది? ఇవి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..


బట్టతల ఎందుకు వస్తుంది?

బట్టతల అనేది సాధారణంగా వంశపారపర్యంగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే జెనిటిక్ గానే కాకుండా మారుతున్న జీవిన శైలి, పోషకాహార లోపం, ఒత్తిడి, కాలుష్యం, కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన షాంపులు, ధీర్ఘకాలిక వ్యాదులు వల్లన కూడా జుట్టు రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉంది. ఇక స్త్రీలల్లో అయితే హార్మోన్ల విడుదలల్లో వచ్చే మార్పువల్లన జుట్టు రాలిపోతుంది.


జుట్టు రాలడం ఆపాలంటే ఈ చిట్కాలు పాటించండి.

పోషకాహార లోపం వల్ల కూడా సాధారణంగా జుట్టురాలే సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

హెయిర్ స్టైల్ కోసం ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ డ్ర‌య్య‌ర్లు, క‌ర్ల‌ర్స్ వాడుతుంటారు. ఇవి జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది.

Also Read: స్పైసీ అండ్ యమ్మీ ఎగ్ పికిల్.. ఒక్కసారి తింటే వదలరు

కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకొని దానిని  పాలల్లో వేసి  బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి తలకు అప్లై చేయాలి. తరచూ ఇలా చేస్తుంటే రాలిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది.

నల్ల మిరియాల పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి దీన్ని తలకు పట్టించాలి. ఇది బట్టతల రాకుండా సహాయం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

సీకాకాయను పొడి చేసి దీన్ని జుట్టుకి పట్టించి గంటసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరుచూ చేస్తే జుట్టురాలే సమస్య తగ్గుతుంది.

 

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×