BigTV English

Formula-E Race : ఫార్ములా కేసులో ఏస్ నెక్ట్స్ జెన్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు

Formula-E Race : ఫార్ములా కేసులో ఏస్ నెక్ట్స్ జెన్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు

Formula-E Race :


⦿ ఫార్ములా కేసులో ఏస్ నెక్ట్స్ జెన్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు
⦿ గ్రీన్‌ కో ఎండీ అనిల్‌కి కూడా ఏసీబీ నోటీసులు
⦿ ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఏసీబీ వెల్లడి
⦿ ఫార్ములా e-కార్‌ రేసు ఒప్పందంపై ప్రశ్నించనున్న ఏసీబీ
⦿ ఈ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కున్న కేటీఆర్, అరవింద్‌కుమార్
⦿ BLN రెడ్డిని సైతం ప్రశ్నించిన ఏసీబీ అధికారులు
⦿ ఫార్ములా e కంపెనీతో ఒప్పందం చేసుకున్న ఏస్‌ నెక్ట్స్‌ జెన్ కంపెనీ
⦿ 4 సీజన్‌లకు స్పాన్సర్‌గా ఉంటామంటూ వెల్లడి
⦿ ఒక సీజన్ పూర్తి కాగానే తప్పుకున్న ఏస్ నెక్ట్స్‌ జెన్
⦿ ఏస్‌ నెక్ట్స్‌ జెన్ తప్పుకోవడంతో ప్రభుత్వంపై భారం

ఫార్ములా e-కార్‌ రేస్ కేసు వ్యవహరంలో ఏసీబీ మరో ముందడుగు వేసింది. ఎస్ నెక్ట్స్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసును నిర్వహించడానికి ఒప్పందం చేసుకుని… 4 సీజన్‌లకు స్పాన్సర్‌గా ఉంటామంటూ తెలిపిన ఎస్ నెక్ట్స్‌ కంపెనీ ఉన్నట్టుండి ఈ ఒప్పందం నుంచి వైదొలగింది. ఈ విషయంపై విచారణకు హాజరుకావాలని తెలుపుతూ ఆ సంస్థకు నోటీసులు పంపింది.


ఫార్ములా కేసులో రోజు రోజుకు విచారణ వేగవంతమవుతుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని విచారించిన ఏసీబీ తాజాగా ఏస్ నెక్ట్స్ జెన్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. 4 సీజన్‌లకు స్పాన్సర్‌గా ఉంటామంటూ ఒప్పందం కుదుర్చున్న ఈ కంపెనీ.. ఒక్క సీజన్ పూర్తి కాగానే తప్పుకుంది. దీంతో ప్రభుత్వంపై భారం పడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏస్ నెక్ట్స్‌ జెన్ ను విచారించే దిశగా ఏసీబీ ముందడుగు వేసింది. ఈ కేసులో విచారణకు ఈ నెల 18న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది.

కేసులో ముగ్గురి విచారణ పూర్తి –

ఈ ఫార్ములా e-కార్‌ రేస్ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో పాటు హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ ఇంజినీర్ ఇన్‌ చీఫ్‌ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచిందని… పలువురు చుట్టూ ఉచ్చు బిగిసే ఛాన్స్ ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

ఇక బీఆర్ఎస్ హయాంలో 2022 అక్టోబరు 25న జరిగిన మొదటి ఒప్పందం ప్రకారం… ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్‌ 9, 10, 11, 12 నిర్వహణకు అయ్యే ఖర్చులను ఏస్‌ నెక్స్ట్‌జెన్‌ భరిస్తామని తెలిపింది. హైదరాబాద్‌ వేదికగా 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్‌ 9 ఫార్ములా ఈ రేస్‌ ఘనంగా జరిగింది. అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్‌ 10 రేస్‌ కోసం ఫార్ములా e ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో) సంస్థకు 2023 మే నెలలో 50% (రూ.90 కోట్లు) చెల్లించాల్సి ఉండగా ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ కంపెనీ అంగీకరించలేదు. అంతేకాకుండా సీజన్‌ 9 ఫార్ములా ఈ రేస్ నిర్వాహణతో తమకు భారీగా నష్టం కలిగిందని.. ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కంపెనీ చేతులెత్తేసింది.

కేటీఆర్‌ ఆదేశాలతో –

స్‌ నెక్ట్స్‌ జెన్‌ కంపెనీ చేతులెత్తేయటంతో కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రమోటర్‌గా హెచ్‌ఎండీఏనే (హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) వ్యవహరించాలని.. అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో 2023 అక్టోబర్ లో రూ.45.71 కోట్లను ఎఫ్‌ఈవోకు హెచ్‌ఎండీఏ నేరుగా బదిలీ చేసింది. ఈ వ్యవహారమే తాజాగా వివాదానికి దారి తీసింది. ఒప్పందం కుదుర్చుకున్న స్‌ నెక్ట్స్‌ జెన్‌ కంపెనీ మధ్యలో తప్పుకున్నప్పటికీ.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై ఏసీబీ విచారణ చేపట్టింది.

ALSO READ : జైలుకు వెళ్లేప్పుడు ఇవి పట్టుకుని వెళ్లు.. కేటీఆర్‌పై రాజాసింగ్ వ్యంగ్యాస్త్రాలు

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×