Kaithi 2: పాన్ ఇండియా వచ్చాకా.. భాష ఏది అన్నది ముఖ్యంగా కాదు. సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు అభిమానులు. కోలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అయితే ఒకప్పుడు హీరోలు ఎవరు అని తెలుసుకొని సినిమాలకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అని తెలుసుకొని సినిమాలు చూస్తున్నారు. అంతలా తమ కథలతో అభిమానులకు పిచ్చెక్కించే డైరెక్టర్స్ తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఉన్నారు. అలాంటి డైరెక్టర్స్ లో లోకేష్ కనగరాజ్ ఒకడు.
నగరం అనే సినిమాతో లోకేష్ డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ కుర్ర డైరెక్టర్ ఆ తరువాత ఖైదీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మొదలయ్యింది. కేవలం డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలన్నీ LCU అనే పేరుతో రిలీజ్ చేస్తున్నాడు లోకేష్. ఇప్పటికే ఖైదీ తరువాత విక్రమ్, లియో లాంటి సినిమాలో LCU లో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఇప్పుడు LCU లోనే మరో సినిమా రెడీ అవుతోంది. ఖైదీకి ప్రీక్వెల్ గా ఖైదీ 2 ను లోకేష్ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. విక్రమ్ చివర్లో రోలెక్స్.. తన కెరీర్ ను నాశనం చేసిన ఢిల్లీపై పగ తీర్చుకోవడానికి బయల్దేరతాడు. ఇక అక్కడ నుంచే సినిమా మొదలుకానుంది. ఖైదీలో ఢిల్లీ అనే పాత్రలో కార్తీ కనిపించాడు. ఈ సినిమాలో ఢిల్లీ జైలుకు వెళ్లి రావడం.. ఒక పోలీస్ కు హెల్ప్ చేయడం.. అతనిని కాపాడడం చూపించారు.
Brahma Anandam Teaser: సందు చూసి చావగొట్టేస్తున్నాడు.. హాస్య బ్రహ్మా కామెడీ నెక్ట్స్ లెవెల్ అంతే
ఇదంతా ఒక ఎత్తు అయితే ఖైదీ సినిమాలో తండ్రీ కూతుళ్ళ బాండింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పుట్టినప్పటి నుంచి అనాథ అనుకున్న ఒక చిన్నారికి.. తన తండ్రి ఉన్నాడు.. తనను చూడడానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు.. ఆమె పడే బాధ, సంతోషం ఇవన్నీ ఇందులో చూపించారు. ఇక ప్రీక్వెల్ లో ఢిల్లీ గతాన్ని చూపించనున్నారు. అసలు ఢిల్లీ ఎవరు.. ? అతడు జైలుకు ఎందుకు వచ్చాడు.. ? రోలెక్స్ కు ఢిల్లీకి ఉన్న సంబంధం ఏంటి.. ? అనేది ఈ సినిమాలో చూపించనున్నాడు లోకేష్. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్య నటించాడు.
హీరోగా సూర్య నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. రోలెక్స్ పాత్ర ఒక్కట్టే ఒక ఎత్తు అని చెప్పుకోవాలి. ఇక సూర్య- కార్తీ అన్నదమ్ములు అన్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు వీరిద్దరు కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకున్నది లేదు. మొన్న కంగువ క్లైమాక్స్ లో కూడా ఇద్దరు విడివిడిగా కనిపించరు కానీ, ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు.
ఇక ఖైదీ 2 లో వీరి మధ్య యుద్ధం ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో మొదలుకానుంది. మరి ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నారో చూడాలి.