Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్న అప్డేట్ ని మేకర్స్ సంక్రాంతి రోజున రివీల్ చేశారు. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి, పవన్ అభిమానులకు ఈ సంక్రాంతిని మరింత స్పెషల్ చేశారు నిర్మాతలు. కానీ తాజాగా ‘మాట వినాలి’ (Mata Vinali) అనే ఈ సాంగ్ ను ఎక్కడ కాపీ కొట్టారో పట్టేశారు నెటిజన్లు. ఈ మేరకు ‘మాట వినరా సాంగ్’ను ఏ సాంగ్ నుంచి కాపీ కొట్టారో దాన్ని కూడా కలిపి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
తారక్ సాంగ్ ను కాపీ కొట్టిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu). ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించబోతున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతిహి, నర్గీస్ ఫక్రీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రోమో సినిమాపై అంచనాలను పెంచింది. రీసెంట్ గా ‘మాట వినాలి’ అనే సాంగ్ ను రిలీజ్ చేస్తామని చెప్పి పవన్ అభిమానులను మేకర్స్ నిరాశపరిచారు. ఆ తర్వాత ‘మాట వినరా’ వీడియో సాంగ్ పూర్తిగా లీక్ అయింది.
ఇక అఫీషియల్ గా జనవరి 14న ‘మాట వినాలి’ (Mata Vinali) సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. పాటని అలా రిలీజ్ చేశారో లేదో, ఎక్కడి నుంచి ఈ సాంగ్ కాపీ కొట్టారో నెటిజెన్లు ఇట్టే పట్టేశారు. స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాటను తారక్ సాంగ్ నుంచి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే… ‘మాట వినరా’ అంటూ సాగిన ఈ పాటలో తారక్ హీరోగా నటించిన ‘జై లవకుశ’ సినిమాలోని “నీ కళ్ళలోన” అనే సాంగ్ నుంచి మ్యూజిక్ బిట్ ను ఉన్నది ఉన్నట్టుగా దించేశారు అంటూ ప్రూఫ్ తో సహా వీడియోలు చేసి పెట్టారు. చిన్న ప్రోమోకే ఇలా కాపీ అంటూ కామెంట్స్ వినిపిస్తే, ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో మరి.
ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి ‘మాట వినాలి’ కంప్లీట్ సాంగ్ ను జనవరి 17న ఉదయం 10 20 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రోమోలో అఫీషియల్ గా వెల్లడించారు. దీంతో ఈ పాట కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ పాటను జనవరి 6వ తేదీనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి, జనవరి 17న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.