BigTV English

RTA Offices: ఆర్టీవో ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు.. ఉద్యోగుల వద్ద లెక్కలు చూపని భారీ నగదు!

RTA Offices: ఆర్టీవో ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు.. ఉద్యోగుల వద్ద లెక్కలు చూపని భారీ నగదు!

ACB Raids in RTA Offices in Telangana: ఆర్టీవో ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది వద్ద ఉన్న నగదును, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు.


రాష్ట్రంలోని పలు ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ లోని పాతబస్తీ, బండ్లగూడ, టోలిచౌకి, మలక్ పేట్, నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అదికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు దరఖాస్తుదారులను నిలిపివేశారు.

అదేవిధంగా మహబూబ్ నగర్ లోని ఆర్టీఏ ఆఫీసులో కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఐదుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని ఆర్టీఏ ఆఫీసులో కూడా సోదాలు చేశారు. అక్కడ సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ. 35 వేలు స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న ఏడుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.


Also Read: కీరవాణితో తెలంగాణ గీతంపై ట్రోలింగ్.. తనకు సంబంధం లేదన్న సీఎం రేవంత్

ఇటు మహబూబాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసులో ఆర్టీవో గౌస్ పాషా డ్రైవర్ వద్ద అక్రమంగా ఉన్న రూ. 16500 నగదు, రెన్యువల్స్, ఫిట్ నెస్ పత్రాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అక్రమంగా రూ. 4500 నగదు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా నూతన లైసెన్సులు, ఫిట్ నెస్ పత్రాలను గుర్తించారు. ఇటు కౌంటర్లలో ఉన్న ఉద్యోగుల వద్ద కూడా లెక్కలు చూపని భారీ నగదు లభ్యమైందని అధికారులు తెలిపారు.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×